Padamti neebadige bhaagyamulu

పడఁతి నీపతికె భాగ్యములు
Language

(॥పల్లవి॥)
పడఁతి నీపతికె భాగ్యములు
తొడిఁబడ దొరకెను దోమట్లు

(॥పడఁతి॥)
తెలియకాని నీ తేనెలమాటలు
తిలకింపఁగఁ దరితీపులు
చలిమి బలిమి నీ సరసపు సన్నలు
కల నిమ్మపండ్ల కానికలు

(॥పడఁతి॥)
ననిచిన సెలవుల నవ్వుల తేటలు
వొనరిన వలపుల వూటలు
కొనచూపుల నీ కూరిమి కొసరులు
చొనిపిన పొందుల చుట్టరికములు

(॥పడఁతి॥)
మిక్కిలి కాఁగిట మెరయు నీ రతులు
వొక్కటఁ బెనగొను వుంకువలు
యిక్కువ శ్రీవేంకటేశు నెనసితివి
మొక్కలములేని మోహములు

(||pallavi||)
paḍam̐ti nībadigĕ bhāgyamulu
tŏḍim̐baḍa dŏragĕnu domaṭlu

(||paḍam̐ti||)
tĕliyagāni nī tenĕlamāḍalu
tilagiṁpam̐gam̐ daridībulu
salimi balimi nī sarasabu sannalu
kala nimmabaṁḍla kānigalu

(||paḍam̐ti||)
nanisina sĕlavula navvula teḍalu
vŏnarina valabula vūḍalu
kŏnasūbula nī kūrimi kŏsarulu
sŏnibina pŏṁdula suṭṭarigamulu

(||paḍam̐ti||)
mikkili kām̐giḍa mĕrayu nī radulu
vŏkkaḍam̐ bĕnagŏnu vuṁkuvalu
yikkuva śhrīveṁkaḍeśhu nĕnasidivi
mŏkkalamuleni mohamulu