పడఁతి ఇటని విన్నపము సేయవే తాఁ
(॥పల్లవి॥)
పడఁతి ఇటని విన్నపము సేయవే తాఁ
గడదాఁకా నిందుకైనఁ గలఁడుగా తాను
(॥పడ॥)
సరి నిపుడైన విచారించెఁగా నన్ను
కురిసి విరహమే పై కుప్పసేసెఁగా
మరునికాఁకల నామన సిది యేమైన
గరిమతో సూడువట్టఁగలఁడుగా తాను
(॥పడ॥)
తలఁచి తనకు నాపై దయపుట్టెఁగాః నాకు
వలపులు మించనైనా వరమిచ్చెఁగా
చెలఁగి యాసలచే నాజీవ మెంతబడలినఁ
గలిమితో సేకరించఁగలఁడుగా తాను
(॥పడ॥)
గక్కన విచ్చేసి నన్నుఁ గాఁగిలించెఁగా నేఁడు
యెక్కువైన శ్రీవేంకటేశ్వరుఁడు
దిక్కయి నన్నిట్లానే దినదినమునుఁ గూడ
కక్కసము గానివాఁడు గలఁడుగా తాను
(||pallavi||)
paḍam̐ti iḍani vinnabamu seyave tām̐
gaḍadām̐kā niṁdugainam̐ galam̐ḍugā tānu
(||paḍa||)
sari nibuḍaina visāriṁchĕm̐gā nannu
kurisi virahame pai kuppasesĕm̐gā
marunigām̐kala nāmana sidi yemaina
garimado sūḍuvaṭṭam̐galam̐ḍugā tānu
(||paḍa||)
talam̐si tanagu nābai dayabuṭṭĕm̐gāḥ nāgu
valabulu miṁchanainā varamichchĕm̐gā
sĕlam̐gi yāsalase nājīva mĕṁtabaḍalinam̐
galimido segariṁcham̐galam̐ḍugā tānu
(||paḍa||)
gakkana vichchesi nannum̐ gām̐giliṁchĕm̐gā nem̐ḍu
yĕkkuvaina śhrīveṁkaḍeśhvarum̐ḍu
dikkayi nanniṭlāne dinadinamunum̐ gūḍa
kakkasamu gānivām̐ḍu galam̐ḍugā tānu