పడఁతి భారము నీదే పరాకు సేయకు మింక
(॥పల్లవి॥)
పడఁతి భారము నీదే పరాకు సేయకు మింక
సడిఁ బెట్ట కిట్టే నీవే చన వియ్యవలెను
(॥॥)
సిగ్గుతో నున్నది చెలి సేసే విన్నపము లెల్లా
దిగ్గన నీలో నీవే తెలియవలే
యెగ్గు లేమీ నెంచదు ఇచ్చకురాలై వున్నది
అగ్గలమై నీవే ఇంకా నాదరించవలెను
(॥॥)
చింతతో నున్నది యీకె సేసేది సేవ లెల్లా
కాంతుఁడవు నీవే మరి కై కొనవలె
పంతములు నెరపదు భావించి నిన్నుఁ దాను
సంతోసించఁ జేసె నీవే సరిఁ గావ వలెను
(॥॥)
వినయముతో నున్నది వెస నీ లేమ కౌఁగిలి
పనివడి నీవే యిచ్చి పాలించవలె
ఘనుఁడ శ్రీ వేంకటేశ కాంత యలమేల్మంగను
తనియ నీవే కూడి దక్కియుండవలెనూ.
(||pallavi||)
paḍam̐ti bhāramu nīde parāgu seyagu miṁka
saḍim̐ bĕṭṭa kiṭṭe nīve sana viyyavalĕnu
(||||)
siggudo nunnadi sĕli sese vinnabamu lĕllā
diggana nīlo nīve tĕliyavale
yĕggu lemī nĕṁchadu ichchagurālai vunnadi
aggalamai nīve iṁkā nādariṁchavalĕnu
(||||)
siṁtado nunnadi yīgĕ sesedi seva lĕllā
kāṁtum̐ḍavu nīve mari kai kŏnavalĕ
paṁtamulu nĕrabadu bhāviṁchi ninnum̐ dānu
saṁtosiṁcham̐ jesĕ nīve sarim̐ gāva valĕnu
(||||)
vinayamudo nunnadi vĕsa nī lema kaum̐gili
panivaḍi nīve yichchi pāliṁchavalĕ
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kāṁta yalamelmaṁganu
taniya nīve kūḍi dakkiyuṁḍavalĕnū.