Padadee neevoom gooduga badugarayyaa

పడతీ నీవూఁ గూడుక బదుకరయ్యా
Language

(॥పల్లవి॥)
పడతీ నీవూఁ గూడుక బదుకరయ్యా
చిడుముడి యాపె లోను సేసుకొనెఁగా

(॥పడ॥)
పగటుకు చాలనొత్తి భావము గరఁగఁ జేసి
చిగురుమోవిపైనాకె చేఁత సేసెఁగా
నగవులు నవ్వి నీతో ననుపులు పచరించి
తగిలి తగిలి నిన్ను దక్కఁగొనెఁగా

(॥పడ॥)
పచ్చి వెచ్చి మాటలాడి పలువలపులు రేఁచి
యిచ్చకాన నీకాపె యేలికాయఁగా
మచ్చికలు నటియించి మంతనాలు సారెనాడి
కుచ్చిన కాఁగిట నిన్ను గురిసేసెఁగా

(॥పడ॥)
పాదముపైఁ జెయి వేసి పక్కన మర్మములంటి
సేదదేరఁ గూడి యాపె సేవ సేసెఁగా
యీదెస శ్రీవేంకటేశ యిట్టి నన్నుఁ గూడితివి
పోదిసేసి నిన్నిందుకు బోదించెఁగా

(||pallavi||)
paḍadī nīvūm̐ gūḍuga badugarayyā
siḍumuḍi yābĕ lonu sesugŏnĕm̐gā

(||paḍa||)
pagaḍugu sālanŏtti bhāvamu garam̐gam̐ jesi
sigurumovibaināgĕ sem̐ta sesĕm̐gā
nagavulu navvi nīdo nanubulu pasariṁchi
tagili tagili ninnu dakkam̐gŏnĕm̐gā

(||paḍa||)
pachchi vĕchchi māḍalāḍi paluvalabulu rem̐si
yichchagāna nīgābĕ yeligāyam̐gā
machchigalu naḍiyiṁchi maṁtanālu sārĕnāḍi
kuchchina kām̐giḍa ninnu gurisesĕm̐gā

(||paḍa||)
pādamubaim̐ jĕyi vesi pakkana marmamulaṁṭi
sedaderam̐ gūḍi yābĕ seva sesĕm̐gā
yīdĕsa śhrīveṁkaḍeśha yiṭṭi nannum̐ gūḍidivi
podisesi ninniṁdugu bodiṁchĕm̐gā