పదపద ఇఁకనేలే తనతోఁ బతిమాటలు దగునా
(॥పల్లవి॥)
పదపద ఇఁకనేలే తనతోఁ బతిమాటలు దగునా
యెదురెదురనె తా నాడినమాటలు యెంచఁగ వసమౌనా
(॥పద॥)
చాలుఁజాలు నగపూ ఇఁక సారెసారె నేలా
తాలిమి నొకసతిపై నొరగుండియు తగదు వేరొకతెఁ బిలువఁగను
కేలుచాఁచి మొక్కితిఁ దనకూ నను గెరలించఁగఁ దగదు
వాలుఁగన్నులను మొక్కినయందుకు వడి మనసున నే దీవించితిని
(॥పద॥)
ఆయనాయఁ బ్రియమూ ఇఁక సంతకోప నేనూ
మాయలచూ పొకసతిపై నిలుపుక మాటలు నాతో నాడీనా
కాయపుఁగాఁకలు ఘనమాయా తాఁ గలిగినపల మిదివో
చాయల సన్నల వలపులు చల్లిన జాణతనముల నే కలసితిని
(॥పద॥)
చెల్లెఁజెల్లె జింతా ఇఁక సెలవుకెక్కెఁ బనులు
కల్లకాదు శ్రీవేంకటరమణుఁడు కలసెఁ గళలు మీరా
కొల్లలాయ నిక్కువరతులూ నాకోరిక దైవారె
మొల్లమిఁదనమోవితేనియలు ముయికి ముయిలు గాఁగా
(||pallavi||)
padabada im̐kanele tanadom̐ badimāḍalu dagunā
yĕdurĕduranĕ tā nāḍinamāḍalu yĕṁcham̐ga vasamaunā
(||pada||)
sālum̐jālu nagabū im̐ka sārĕsārĕ nelā
tālimi nŏgasadibai nŏraguṁḍiyu tagadu verŏgadĕm̐ biluvam̐ganu
kelusām̐si mŏkkidim̐ danagū nanu gĕraliṁcham̐gam̐ dagadu
vālum̐gannulanu mŏkkinayaṁdugu vaḍi manasuna ne dīviṁchidini
(||pada||)
āyanāyam̐ briyamū im̐ka saṁtagoba nenū
māyalasū pŏgasadibai nilubuga māḍalu nādo nāḍīnā
kāyabum̐gām̐kalu ghanamāyā tām̐ galiginabala midivo
sāyala sannala valabulu sallina jāṇadanamula ne kalasidini
(||pada||)
sĕllĕm̐jĕllĕ jiṁtā im̐ka sĕlavugĕkkĕm̐ banulu
kallagādu śhrīveṁkaḍaramaṇum̐ḍu kalasĕm̐ gaḽalu mīrā
kŏllalāya nikkuvaradulū nāgoriga daivārĕ
mŏllamim̐danamovideniyalu muyigi muyilu gām̐gā