పదారువేలు(ల?) సతుల పతివి నీవు
(॥పల్లవి॥)
పదారువేలు(ల?) సతుల పతివి నీవు
సుదతి వెంగెమాడదు సుమ్మీ యీ పట్టుకు
(॥పదా॥)
మొక్కిమొక్కి చెలియ నీముందరనే వుండఁగాను
తక్కక సిగ్గుతోనేల తలవంచేవు
నిక్కి వెరొకతెవద్ద నీ వుండఁగాఁ గనెనో
ఇక్కడ నీ వందుకుఁగా నేఁటికి లోగేవు
(॥పదా॥)
వేడుకతో నాపె నిన్ను వేమారు నుతించంగాను
యీడ ముసుఁగువెట్టుక యెంత నవ్వేవు
పాడితో నీ వెవ్వతెకు బాస లియ్యఁగా వినెనో
తోడనే నీవప్పటి నిందులకేల కొంకేవు
(॥పదా॥)
నెమ్మది నలమేల్ మంగ నిన్నుఁ గాఁగిలించఁగాను
అమ్మరో నీవెంతేసిప్రియాలు చెప్పేవు
కమ్మి శ్రీవేంకటేశ నీకత లీపె దెలిసెనో
సమ్మతించె నిందుకుఁగా చంద మెంతసేసేవు
(||pallavi||)
padāruvelu(la?) sadula padivi nīvu
sudadi vĕṁgĕmāḍadu summī yī paṭṭugu
(||padā||)
mŏkkimŏkki sĕliya nīmuṁdarane vuṁḍam̐gānu
takkaga siggudonela talavaṁchevu
nikki vĕrŏgadĕvadda nī vuṁḍam̐gām̐ ganĕno
ikkaḍa nī vaṁdugum̐gā nem̐ṭigi logevu
(||padā||)
veḍugado nābĕ ninnu vemāru nudiṁchaṁgānu
yīḍa musum̐guvĕṭṭuga yĕṁta navvevu
pāḍido nī vĕvvadĕgu bāsa liyyam̐gā vinĕno
toḍane nīvappaḍi niṁdulagela kŏṁkevu
(||padā||)
nĕmmadi nalamel maṁga ninnum̐ gām̐giliṁcham̐gānu
ammaro nīvĕṁtesipriyālu sĕppevu
kammi śhrīveṁkaḍeśha nīgada lībĕ dĕlisĕno
sammadiṁchĕ niṁdugum̐gā saṁda mĕṁtasesevu