పచ్చిసేయ వసమా పడఁతుల భావ మిది
(॥పల్లవి॥)
పచ్చిసేయ వసమా పడఁతుల భావ మిది
గచ్చుల మదనగతి గరఁగుటగాక
(॥పచ్చి॥)
వంక దిద్దవసమా వనిత నీకురు లవి
అంకెల సింగారమాయవనుటగాక
మంకు దీర్చవసమా మది ఇంచుకుచముల
పొంకపుఁ గటూరమే పొగడుతగాక
(॥పచ్చి॥)
సాదుసేయవసమా చంచలపుఁగనుచూపు
మేదకాన మేలనుచు మెచ్చుటగాక
భేదించవసమా బెడిదపునీపిఱుఁదు
సోదించరాక లోలోఁ జొక్కుటింతేకాక
(॥పచ్చి॥)
చవులెంచవసమా జవ్వని నీయధరము
వివరించి పలుముద్ర వేయుటగాక
నవమై శ్రీవేంకటాద్రి నాడుఁడ గనక నిను
కవగూడితిని యిదె కాణాచిగాక
(||pallavi||)
pachchiseya vasamā paḍam̐tula bhāva midi
gachchula madanagadi garam̐guḍagāga
(||pachchi||)
vaṁka diddavasamā vanida nīguru lavi
aṁkĕla siṁgāramāyavanuḍagāga
maṁku dīrsavasamā madi iṁchugusamula
pŏṁkabum̐ gaḍūrame pŏgaḍudagāga
(||pachchi||)
sāduseyavasamā saṁchalabum̐ganusūbu
medagāna melanusu mĕchchuḍagāga
bhediṁchavasamā bĕḍidabunībiṟum̐du
sodiṁcharāga lolom̐ jŏkkuḍiṁtegāga
(||pachchi||)
savulĕṁchavasamā javvani nīyadharamu
vivariṁchi palumudra veyuḍagāga
navamai śhrīveṁkaḍādri nāḍum̐ḍa ganaga ninu
kavagūḍidini yidĕ kāṇāsigāga