పచ్చిసేసి వెచ్చిసేసి పాయ మింత నలఁచనేలా
(॥పల్లవి॥)
పచ్చిసేసి వెచ్చిసేసి పాయ మింత నలఁచనేలా
మచ్చికెల్లఁ జూతుగాని మాపటంత రారా
(॥పచ్చి॥)
మాఁచనోలిచెన్నుఁడి మాటలాడి మమ్మునింత
రేఁచనేల వుండవోయి రేలుఁబరగళ్లును
దాఁచలేము మోహమును తమకమింత గలిగితేను
యేఁచనేల వీదివీది యింటికింక రారా
(॥పచ్చి॥)
వేణునాదమోహనా వెలిగోరు మోఁపి మోఁపి
జాణతనము లాడనేల చక్కనుండరా
ప్రాణ మింత కోపదూను పలుకులేమి గలిగినాను
వీణెలోనె తెలుతుగాని వెంట వెంట రారా
(॥పచ్చి॥)
నందగోపనందనా నవ్వినవ్వి మమ్ము నేడు
కందువందు చేయివేసి కరఁగఁజేసితి-
విందుగూడినట్టు శ్రీ వేంకటాద్రి నుండి వచ్చి
దిందుపడతి మాఁచనోల దినదినంబు రారా
(||pallavi||)
pachchisesi vĕchchisesi pāya miṁta nalam̐sanelā
machchigĕllam̐ jūdugāni mābaḍaṁta rārā
(||pachchi||)
mām̐sanolisĕnnum̐ḍi māḍalāḍi mammuniṁta
rem̐sanela vuṁḍavoyi relum̐baragaḽlunu
dām̐salemu mohamunu tamagamiṁta galigidenu
yem̐sanela vīdivīdi yiṁṭigiṁka rārā
(||pachchi||)
veṇunādamohanā vĕligoru mom̐pi mom̐pi
jāṇadanamu lāḍanela sakkanuṁḍarā
prāṇa miṁta kobadūnu palugulemi galiginānu
vīṇĕlonĕ tĕludugāni vĕṁṭa vĕṁṭa rārā
(||pachchi||)
naṁdagobanaṁdanā navvinavvi mammu neḍu
kaṁduvaṁdu seyivesi karam̐gam̐jesidi-
viṁdugūḍinaṭṭu śhrī veṁkaḍādri nuṁḍi vachchi
diṁdubaḍadi mām̐sanola dinadinaṁbu rārā