(॥పల్లవి॥)
పచ్చిమాట లాడేవు బయకాఁడా
గచ్చులు సేతురా నీవు కాతరీఁడా
(॥పచ్చి॥)
తలుపేల మూసేవు తమియేల రేఁచేవు
వెలలేని వలపుల వేడకకాఁడ
చెలుల నేలంటేవు సిగ్గులేల ముట్టేవు
కొలఁదిలేని రతుల కోడెకాఁడా
(॥పచ్చి॥)
కొప్పేల దువ్వేవు కొంగేల పట్టేవు
దప్పిదేరేకాఁకలదాయగాఁడా
తప్ప యేల చూచేవు తవనలేల పెట్టేవు
ముప్పిరిఁ గళలు రేఁచే మొక్కలికాఁడా
(॥పచ్చి॥)
నవ్వులేల నవ్వేవు నయములేల చూపేవు
జవ్వనుమదముల జాజరకాఁడ
యెవ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నివ్వటిల్లు చేఁతల నీటకాఁడ
(||pallavi||)
pachchimāḍa lāḍevu bayagām̐ḍā
gachchulu sedurā nīvu kādarīm̐ḍā
(||pachchi||)
talubela mūsevu tamiyela rem̐sevu
vĕlaleni valabula veḍagagām̐ḍa
sĕlula nelaṁṭevu siggulela muṭṭevu
kŏlam̐dileni radula koḍĕgām̐ḍā
(||pachchi||)
kŏppela duvvevu kŏṁgela paṭṭevu
dappideregām̐kaladāyagām̐ḍā
tappa yela sūsevu tavanalela pĕṭṭevu
muppirim̐ gaḽalu rem̐se mŏkkaligām̐ḍā
(||pachchi||)
navvulela navvevu nayamulela sūbevu
javvanumadamula jājaragām̐ḍa
yĕvvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nivvaḍillu sem̐tala nīḍagām̐ḍa