పచ్చిగాఁ గానఁగరాదా పైపై ప్రియాలు తన్ను
(॥పల్లవి॥)
పచ్చిగాఁ గానఁగరాదా పైపై ప్రియాలు తన్ను
విచ్చి పరులాడేరనే వెరపింతే కాక
(॥పచ్చి॥)
తలఁపు లేకములైతే తానాడ నుండునా
వలసీనొల్లము లైనవగలుగాక
వలపులు నిజమైతే వరుసవం తెంచునా
పిలిచి పెండ్లాడినట్టి పేరు కింతేకాక
(॥పచ్చి॥)
మాటలే యేకములైతే మారుత్తర మిచ్చునా
జూటరిమాయల తనసుద్దులు గాక
నాటుఁజూపే కలిగితే నవ్వులు రాకుండునా
మేఁటిబాసయిచ్చినట్టిమేర కింతేగాక
(॥పచ్చి॥)
ప్రాణము లేకములై తే పగలురే యెరుఁగునా
జాణతనముల లోని సటలుగాక
నాణెపు శ్రీవేంకటాద్రినాథుఁ డింతసేసి కూడె
రాణువెల్లా నెరిఁగినరాపు కింతేకాక
(||pallavi||)
pachchigām̐ gānam̐garādā paibai priyālu tannu
vichchi parulāḍerane vĕrabiṁte kāga
(||pachchi||)
talam̐pu legamulaide tānāḍa nuṁḍunā
valasīnŏllamu lainavagalugāga
valabulu nijamaide varusavaṁ tĕṁchunā
pilisi pĕṁḍlāḍinaṭṭi peru kiṁtegāga
(||pachchi||)
māḍale yegamulaide māruttara michchunā
jūḍarimāyala tanasuddulu gāga
nāḍum̐jūbe kaligide navvulu rāguṁḍunā
mem̐ṭibāsayichchinaṭṭimera kiṁtegāga
(||pachchi||)
prāṇamu legamulai te pagalure yĕrum̐gunā
jāṇadanamula loni saḍalugāga
nāṇĕbu śhrīveṁkaḍādrināthum̐ ḍiṁtasesi kūḍĕ
rāṇuvĕllā nĕrim̐ginarābu kiṁtegāga