పచ్చిదేరిన పనికిఁ బరాకులేల
(॥పల్లవి॥)
పచ్చిదేరిన పనికిఁ బరాకులేల
మచ్చికతో మీరిద్దరు మన్నించేవారము
(॥పచ్చి॥)
ఇంతి నీ మొగము చూచె ఇన్నిటికి నొడఁ బడి
అంతరంగములోపను లానతీవయ్యా
వింతవారమా నీకు వింటేనేమి సిగ్గుగాదు
చెంతల మివూడిగాలు సేసేటివారము
(॥పచ్చి॥)
పతి నీతో మాటలాడె చనవెల్లాఁ జెల్లించె
మితిమీర నవ్వునవ్వి మెచ్చవయ్యా
మతకపు వారమా మరఁగు లిందులోనేల
అతివకు నీకు నేము అడపమువారము
(॥పచ్చి॥)
తరుణి కాఁగిటఁ గూడె తలపెల్లా నీడేరె
పొరిసి నానారతుల భోగించవయ్యా
సరివారమా నేము చాయల శ్రీవేంకటేశ
ధరలోఁ గూడితివి నీదయలోనివారము
(||pallavi||)
pachchiderina panigim̐ barāgulela
machchigado mīriddaru manniṁchevāramu
(||pachchi||)
iṁti nī mŏgamu sūsĕ inniḍigi nŏḍam̐ baḍi
aṁtaraṁgamulobanu lānadīvayyā
viṁtavāramā nīgu viṁṭenemi siggugādu
sĕṁtala mivūḍigālu seseḍivāramu
(||pachchi||)
padi nīdo māḍalāḍĕ sanavĕllām̐ jĕlliṁchĕ
midimīra navvunavvi mĕchchavayyā
madagabu vāramā maram̐gu liṁdulonela
adivagu nīgu nemu aḍabamuvāramu
(||pachchi||)
taruṇi kām̐giḍam̐ gūḍĕ talabĕllā nīḍerĕ
pŏrisi nānāradula bhogiṁchavayyā
sarivāramā nemu sāyala śhrīveṁkaḍeśha
dharalom̐ gūḍidivi nīdayalonivāramu