పచ్చిదేరీ నీమాటలు బతుకవయ్య
(॥పల్లవి॥)
పచ్చిదేరీ నీమాటలు బతుకవయ్య
విచ్చనవిడిని వూరవిందులాయ వలపు
(॥పచ్చి॥)
సంగడి నుండేవారు సరసములాడేవారు
యెంగిలిమోవిచ్చేవా రెందరు నీకు
అంగవించి యాసపడేవప్పటి నే బాఁతైతినా
వింగడించరాక చల్లువెదలాయ వలపు
(॥పచ్చి॥)
వూడిగాలు సేసేవారు వొరసి నవ్వేటివారు
యీడుచూపి వుండేవారు యెందరు నీకు
జోడుగా మరియు నీచూపులు నాపైఁ బారెనా
నీడలనే వసంతపు నీళ్ళాయ వలపు
(॥పచ్చి॥)
చెలరేఁగి పాడేవారు చేసన్నలు చేసేవారు
యెలయించి పొందేవారు యెందరు నీకు
ఇల శ్రీవేంకటేశ నన్నేలితి విచ్చ గల్గెనా
తిలకించి కడుఁ దరితీపులాయ వలపు
(||pallavi||)
pachchiderī nīmāḍalu badugavayya
vichchanaviḍini vūraviṁdulāya valabu
(||pachchi||)
saṁgaḍi nuṁḍevāru sarasamulāḍevāru
yĕṁgilimovichchevā rĕṁdaru nīgu
aṁgaviṁchi yāsabaḍevappaḍi ne bām̐taidinā
viṁgaḍiṁcharāga salluvĕdalāya valabu
(||pachchi||)
vūḍigālu sesevāru vŏrasi navveḍivāru
yīḍusūbi vuṁḍevāru yĕṁdaru nīgu
joḍugā mariyu nīsūbulu nābaim̐ bārĕnā
nīḍalane vasaṁtabu nīḽḽāya valabu
(||pachchi||)
sĕlarem̐gi pāḍevāru sesannalu sesevāru
yĕlayiṁchi pŏṁdevāru yĕṁdaru nīgu
ila śhrīveṁkaḍeśha nannelidi vichcha galgĕnā
tilagiṁchi kaḍum̐ daridībulāya valabu