పచ్చిదేరె నీ పనులు భామల ముందరనెల్లా
(॥పల్లవి॥)
పచ్చిదేరె నీ పనులు భామల ముందరనెల్లా
కచ్చుపెట్టి ఇంక నీకుఁ గాదన నేమున్నది
(॥పచ్చి॥)
వావులు చెప్పుకొంటాను వద్ద నాపె వుండఁగాను
నీ విందరిలోఁ దారుకాణించుకోవద్దా
భావించక నీ వెక్కడో పరాకున నుండితేను
ఆవిధము నీకు సమ్మతైనట్టేకాదా
(॥పచ్చి॥)
గుఱుతులు చూపియాపె కొలువులు సేయఁగాను
పిఱితీసి నీవు తప్పించుకోవద్దా
తఱితో నిప్పుడు మొకదాకిరితో నుండితేను
యెఱిఁగెఱిఁ గిదియెల్లా నియ్యకొంటేకాదా
(॥పచ్చి॥)
సరసములాడి యాపె చన్నుల నొత్తఁగాను
వరుసతోఁ జేతనంటి వారించవద్దా
ఇరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
గరిమ నూరకుండితే కైకొంటేకాదా
(||pallavi||)
pachchiderĕ nī panulu bhāmala muṁdaranĕllā
kachchubĕṭṭi iṁka nīgum̐ gādana nemunnadi
(||pachchi||)
vāvulu sĕppugŏṁṭānu vadda nābĕ vuṁḍam̐gānu
nī viṁdarilom̐ dārugāṇiṁchugovaddā
bhāviṁchaga nī vĕkkaḍo parāguna nuṁḍidenu
āvidhamu nīgu sammadainaṭṭegādā
(||pachchi||)
guṟudulu sūbiyābĕ kŏluvulu seyam̐gānu
piṟidīsi nīvu tappiṁchugovaddā
taṟido nippuḍu mŏgadāgirido nuṁḍidenu
yĕṟim̐gĕṟim̐ gidiyĕllā niyyagŏṁṭegādā
(||pachchi||)
sarasamulāḍi yābĕ sannula nŏttam̐gānu
varusadom̐ jedanaṁṭi vāriṁchavaddā
iravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
garima nūraguṁḍide kaigŏṁṭegādā