Pachchidera nitte neevu badugavammaa

పచ్చిదేర నిట్టె నీవు బదుకవమ్మా
Language

(॥పల్లవి॥)
పచ్చిదేర నిట్టె నీవు బదుకవమ్మా
యిచ్చిన బాసలు తుద కెక్కెఁ గదవమ్మా

(॥పచ్చి॥)
చింత లెల్లఁ బాసె నీచేతికి విభుడు వచ్చె
పంతపుమామీఁదిదూరు పాసెఁగదమ్మా
చెంతల ముచ్చట దీరె సెలవినవ్వులు వచ్చె
యింతటినీకోరికలు యీడేరెఁగదమ్మా

(॥పచ్చి॥)
మచ్చికలు దై వారె మన మీ కొక్కటాయ
చెచ్చెర నీచలములు చెల్లెఁగదమ్మా
రచ్చకెక్కె నేఁడిందరిరాజసపుఁ జేఁత లెల్లా
మెచ్చులు మామీఁద మీకు మించెఁ గదవమ్మా

(॥పచ్చి॥)
మోమునఁ గళలు మీరె మోము వెల్లవి రాయ
వాములై మామాట సరివచ్చెఁగదమ్మా
చేముంచి కూడితి రిదె శ్రీ వేంకటేశుఁడు నీవు
ఆముకొన్న సంతోసము లాయఁగదవమ్మా

(||pallavi||)
pachchidera niṭṭĕ nīvu badugavammā
yichchina bāsalu tuda kĕkkĕm̐ gadavammā

(||pachchi||)
siṁta lĕllam̐ bāsĕ nīsedigi vibhuḍu vachchĕ
paṁtabumāmīm̐didūru pāsĕm̐gadammā
sĕṁtala muchchaḍa dīrĕ sĕlavinavvulu vachchĕ
yiṁtaḍinīgorigalu yīḍerĕm̐gadammā

(||pachchi||)
machchigalu dai vārĕ mana mī kŏkkaḍāya
sĕchchĕra nīsalamulu sĕllĕm̐gadammā
rachchagĕkkĕ nem̐ḍiṁdarirājasabum̐ jem̐ta lĕllā
mĕchchulu māmīm̐da mīgu miṁchĕm̐ gadavammā

(||pachchi||)
momunam̐ gaḽalu mīrĕ momu vĕllavi rāya
vāmulai māmāḍa sarivachchĕm̐gadammā
semuṁchi kūḍidi ridĕ śhrī veṁkaḍeśhum̐ḍu nīvu
āmugŏnna saṁtosamu lāyam̐gadavammā