పచ్చి చిగురు వంటిది పాయ మనవే
(॥పల్లవి॥)
పచ్చి చిగురు వంటిది పాయ మనవే
మచ్చికతో నన్ను నిఁక మన్నించు మనవే
(॥॥)
వలచిన వారి నేఁప వల దనవే కడుఁ
గలసిన పొందు మానఁ గాఁగా దనవే
పిలిచి వూరకుండేది వెలి తనవే ఆస
కొలిపి కూడకుండితే కొలగాదా యనవే
(॥॥)
తగులై మరి యలుగఁ దగ దనవే
జిగిఁ జెట్ట వట్టే గుట్టు చెల్ల దనవే
మొగము చూచి కొంకితే మోస మనవే
నగి చెనక కుండితే నెగు లంటు ననవే
(॥॥)
యెనసేటి చోట సిగ్గు లేఁటి కనవే
గొన కొన్న రతి జాగు గూడ దనవే
ననిచి శ్రీ వేంకటాద్రిఁ దనిసితి మిద్దరము
మనసులో తమకము మానుపరా దనవే
(||pallavi||)
pachchi siguru vaṁṭidi pāya manave
machchigado nannu nim̐ka manniṁchu manave
(||||)
valasina vāri nem̐pa vala danave kaḍum̐
galasina pŏṁdu mānam̐ gām̐gā danave
pilisi vūraguṁḍedi vĕli tanave āsa
kŏlibi kūḍaguṁḍide kŏlagādā yanave
(||||)
tagulai mari yalugam̐ daga danave
jigim̐ jĕṭṭa vaṭṭe guṭṭu sĕlla danave
mŏgamu sūsi kŏṁkide mosa manave
nagi sĕnaga kuṁḍide nĕgu laṁṭu nanave
(||||)
yĕnaseḍi soḍa siggu lem̐ṭi kanave
gŏna kŏnna radi jāgu gūḍa danave
nanisi śhrī veṁkaḍādrim̐ danisidi middaramu
manasulo tamagamu mānubarā danave