పచ్చి సేయకుందునా పైపై నిన్ను
(॥పల్లవి॥)
పచ్చి సేయకుందునా పైపై నిన్ను
అచ్చలపు నీవు దొరవని యింతేకాక
(॥పచ్చి॥)
నీకన్నుల కావి చూచి నిన్ను మెచ్చకుందునా
దాకొని నీవంటివాని దగ్గరక వుందునా
యీకడ నీమేనితావి ఇందు జొక్కకుందునా
పైకొని నామనసొడబడ దింతేకాక
(॥పచ్చి॥)
ముందు నీభావము చూచి మొక్కు మొక్కకుందునా
చిందేటి చెమట చూచి చెక్కు నొక్కకుందునా
పొందగుఁగళలు చూచి పొగడక వుందునా
యెందు నాపంతము నన్ను నెడసేసీఁగాక
(॥పచ్చి॥)
కాఁగిలించుకోఁగా కొంగు గప్పక నే నుందునా
మూఁగినరతులవేళ ముచ్చటాడకుందునా
వీఁగక శ్రీవేంకటేశ విన్నవించకుందునా
మాఁగినమరపు నన్ను మంకుఁ జేసీఁగాక
(||pallavi||)
pachchi seyaguṁdunā paibai ninnu
achchalabu nīvu dŏravani yiṁtegāga
(||pachchi||)
nīgannula kāvi sūsi ninnu mĕchchaguṁdunā
dāgŏni nīvaṁṭivāni daggaraga vuṁdunā
yīgaḍa nīmenidāvi iṁdu jŏkkaguṁdunā
paigŏni nāmanasŏḍabaḍa diṁtegāga
(||pachchi||)
muṁdu nībhāvamu sūsi mŏkku mŏkkaguṁdunā
siṁdeḍi sĕmaḍa sūsi sĕkku nŏkkaguṁdunā
pŏṁdagum̐gaḽalu sūsi pŏgaḍaga vuṁdunā
yĕṁdu nābaṁtamu nannu nĕḍasesīm̐gāga
(||pachchi||)
kām̐giliṁchugom̐gā kŏṁgu gappaga ne nuṁdunā
mūm̐ginaradulaveḽa muchchaḍāḍaguṁdunā
vīm̐gaga śhrīveṁkaḍeśha vinnaviṁchaguṁdunā
mām̐ginamarabu nannu maṁkum̐ jesīm̐gāga