పాయరాని చుట్టమవు పడఁతికిని
(॥పల్లవి॥)
పాయరాని చుట్టమవు పడఁతికిని
సోయగపు నీ కన్నులఁ జూతువు రావయ్యా
(॥॥)
వినయపుకాఁగిలి వీడుఁ బట్టునేసి నీకు
వొరినమోవితేనే వులుప వట్టె
ఘనకుచములు నీకు కానుక లెత్తుకున్నది
పెనఁగక చెలి నిన్నుఁ బిలిచీని రావయ్యా
(॥॥)
పలుకుల కప్పురాలబాగా లొసగీ నీకు
మలసి మైతావి పరిమళ మున్నది
బలుచెమటపన్నీటఁ బాదారు గడిగి నీకు
తలిరుఁ బోడి ఇదె దగ్గరీ రావయ్యా
(॥॥)
చొక్కపుఁ దనకన్నులచూపుల నెదురుకొనె
పక్కన వలపులనే పాన్పు పరచె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
యిక్కడఁ గూడితివి నీ వెపుపడు రావయ్యా
(||pallavi||)
pāyarāni suṭṭamavu paḍam̐tigini
soyagabu nī kannulam̐ jūduvu rāvayyā
(||||)
vinayabugām̐gili vīḍum̐ baṭṭunesi nīgu
vŏrinamovidene vuluba vaṭṭĕ
ghanagusamulu nīgu kānuga lĕttugunnadi
pĕnam̐gaga sĕli ninnum̐ bilisīni rāvayyā
(||||)
palugula kappurālabāgā lŏsagī nīgu
malasi maidāvi parimaḽa munnadi
balusĕmaḍabannīḍam̐ bādāru gaḍigi nīgu
talirum̐ boḍi idĕ daggarī rāvayyā
(||||)
sŏkkabum̐ danagannulasūbula nĕdurugŏnĕ
pakkana valabulane pānpu parasĕ
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
yikkaḍam̐ gūḍidivi nī vĕbubaḍu rāvayyā