Paayaraani suttamaina praanabamdhuvumdu daanu

పాయరాని చుట్టమైన ప్రాణబంధువుఁడు దాను
Language

(॥పల్లవి॥)
పాయరాని చుట్టమైన ప్రాణబంధువుఁడు దాను
వేయైనాఁ దన చేఁతకు వేసరేనటే

(॥పాయ॥)
తలఁపులోఁగలమాట తనతో నాడుదుఁగాక
అలిగి వేరొక తెతో నాడేనటే
పిలిచి యంతై నాను ప్రియమే సేయుదుఁగాక
చలము లందుకుఁగాను సాదించేనటే

(॥పాయ॥)
చేతికి లోనైనపనిని సేవగాఁ జూపుదుఁగాక
ఆతల నొక్కరిని నేనడిగేనటే
యేతున మరచినాను యెచ్చరికే సేతుఁగాక
కాతరించి వట్టిదూరు గట్టేనటే

(॥పాయ॥)
పట్టరానియాసలకు బలిమిఁ గూడుదుఁగాక
బట్టబయలు సిగ్గులు వడుదునటే
యిట్టే శ్రీవేంకటేశుఁ డిన్నిటాన న్నేలినాఁడు
మట్టు లేనితనమేలు మఱచేనటే

(||pallavi||)
pāyarāni suṭṭamaina prāṇabaṁdhuvum̐ḍu dānu
veyainām̐ dana sem̐tagu vesarenaḍe

(||pāya||)
talam̐pulom̐galamāḍa tanado nāḍudum̐gāga
aligi verŏga tĕdo nāḍenaḍe
pilisi yaṁtai nānu priyame seyudum̐gāga
salamu laṁdugum̐gānu sādiṁchenaḍe

(||pāya||)
sedigi lonainabanini sevagām̐ jūbudum̐gāga
ādala nŏkkarini nenaḍigenaḍe
yeduna marasinānu yĕchcharige sedum̐gāga
kādariṁchi vaṭṭidūru gaṭṭenaḍe

(||pāya||)
paṭṭarāniyāsalagu balimim̐ gūḍudum̐gāga
baṭṭabayalu siggulu vaḍudunaḍe
yiṭṭe śhrīveṁkaḍeśhum̐ ḍinniḍāna nnelinām̐ḍu
maṭṭu lenidanamelu maṟasenaḍe