పాయరాని మగఁడవు పట్టపుదేవుల నేను
(॥పల్లవి॥)
పాయరాని మగఁడవు పట్టపుదేవుల నేను
రాయిడి సేయకుమీ రవ్వ సేసి యిఁకను
(॥॥)
మాఱుకొని నినుఁ బిల్చి మాటలాడితిని
ఆఱడిఁ బెట్టకుమీ అందరిలోన
వేఱులేక నీకు మొక్కి వేఁడుకొంటిఁ గమ్మటిని
వీఱిడిఁ జేయకుమీ వేగిరించి నన్నును
(॥॥)
సెలవుల నవ్వి నీకు చేసన్న సేసితి
వెలుపలఁ జెప్పకుమీ వెక్కసానను
మొలకచన్నుల నొత్తి ముచ్చట మాటాడితి
చలానఁ బెనఁగకుమీ సారెసారె నిపుడు
(॥॥)
కచ్చుపెట్టి మోవి యిచ్చి కాఁగిలించుకొంటిని
పచ్చి సేయకుమీ నన్ను పంతమునను
అచ్చపలమేలుమంగనైననన్ను నేలితివి
ఇచ్చపు శ్రీ వేంకటేశ ఇమ్మీ చనపు
(||pallavi||)
pāyarāni magam̐ḍavu paṭṭabudevula nenu
rāyiḍi seyagumī ravva sesi yim̐kanu
(||||)
māṟugŏni ninum̐ bilsi māḍalāḍidini
āṟaḍim̐ bĕṭṭagumī aṁdarilona
veṟulega nīgu mŏkki vem̐ḍugŏṁṭim̐ gammaḍini
vīṟiḍim̐ jeyagumī vegiriṁchi nannunu
(||||)
sĕlavula navvi nīgu sesanna sesidi
vĕlubalam̐ jĕppagumī vĕkkasānanu
mŏlagasannula nŏtti muchchaḍa māḍāḍidi
salānam̐ bĕnam̐gagumī sārĕsārĕ nibuḍu
(||||)
kachchubĕṭṭi movi yichchi kām̐giliṁchugŏṁṭini
pachchi seyagumī nannu paṁtamunanu
achchabalamelumaṁganainanannu nelidivi
ichchabu śhrī veṁkaḍeśha immī sanabu