పాయపువారమట పండి పొల్లవోయీనా
(॥పల్లవి॥)
పాయపువారమట పండి పొల్లవోయీనా
చాయల మెలఁగవోయి జరపులేమిటికి
(॥పాయ॥)
కన్నుల నీవు మొక్కగ కాదని తోనేనా
చన్నుల నొత్తితేను చాలుననేవా
యెన్నిలేవు నీ యాస లెక్కడ నుండినాను
పన్ని లోనికి రావోయి పరపుమీదికిని
(॥పాయ॥)
సరసము నీవాడఁగ సమ్మతించకుండేనా
వొరసి నేఁగొసరితే నొల్లననేవా
యిరవైన కోరికలే యిందుకు మీఁదుమిక్కిలి
తెరవేసితి రావోయి తేరి నా ముందరికి
(॥పాయ॥)
పై పై నీవు గూడగాను పలుమారు లోఁగేనా
దాపుగా నామోవిచ్చితే తనివందేవా
యేపున శ్రీవేంకటేశ యెప్పుడూ సమరతులే
ఆపనికి రావోయి అప్పటి కాఁగిటికి
(||pallavi||)
pāyabuvāramaḍa paṁḍi pŏllavoyīnā
sāyala mĕlam̐gavoyi jarabulemiḍigi
(||pāya||)
kannula nīvu mŏkkaga kādani tonenā
sannula nŏttidenu sālunanevā
yĕnnilevu nī yāsa lĕkkaḍa nuṁḍinānu
panni lonigi rāvoyi parabumīdigini
(||pāya||)
sarasamu nīvāḍam̐ga sammadiṁchaguṁḍenā
vŏrasi nem̐gŏsaride nŏllananevā
yiravaina korigale yiṁdugu mīm̐dumikkili
tĕravesidi rāvoyi teri nā muṁdarigi
(||pāya||)
pai pai nīvu gūḍagānu palumāru lom̐genā
dābugā nāmovichchide tanivaṁdevā
yebuna śhrīveṁkaḍeśha yĕppuḍū samaradule
ābanigi rāvoyi appaḍi kām̐giḍigi