పాయపువాఁడవు నీకు పచ్చి సేఁతలు బాఁతా
(॥పల్లవి॥)
పాయపువాఁడవు నీకు పచ్చి సేఁతలు బాఁతా
ఆయములు దెలిసియు నడిగేఁగాక
(॥పాయ॥)
చెక్కులఁ గళలు నిక్కె చేవదేరెఁ గెమ్మోవిని
యెక్కడఁ గలిగెనయ్య యివి నీకు
చక్కనిరమణులలో సాముసేసేవాఁడవు
అక్కరా నీకిని వూర కడిగేఁగాక
(॥పాయ॥)
చెంగలించె నీకన్నులు చెమరించె మేనెల్లా
అంగవించి యేడఁజేరెనయ్యా నీకు
అంగడివలపులకు ఆసపడేటివాఁడవు
అంగమేకాదా నిన్ను నడిగేఁగాని
(॥పాయ॥)
ముంచెఁ గాఁగిట వాసన మూఁపులు మూఁడాయను
కొంచక యెందు నంటించుకొంటివయ్యా
యెంచుకొని శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
అంచల నీసాజమే అగిగేఁగాక
(||pallavi||)
pāyabuvām̐ḍavu nīgu pachchi sem̐talu bām̐tā
āyamulu dĕlisiyu naḍigem̐gāga
(||pāya||)
sĕkkulam̐ gaḽalu nikkĕ sevaderĕm̐ gĕmmovini
yĕkkaḍam̐ galigĕnayya yivi nīgu
sakkaniramaṇulalo sāmusesevām̐ḍavu
akkarā nīgini vūra kaḍigem̐gāga
(||pāya||)
sĕṁgaliṁchĕ nīgannulu sĕmariṁchĕ menĕllā
aṁgaviṁchi yeḍam̐jerĕnayyā nīgu
aṁgaḍivalabulagu āsabaḍeḍivām̐ḍavu
aṁgamegādā ninnu naḍigem̐gāni
(||pāya||)
muṁchĕm̐ gām̐giḍa vāsana mūm̐pulu mūm̐ḍāyanu
kŏṁchaga yĕṁdu naṁṭiṁchugŏṁṭivayyā
yĕṁchugŏni śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
aṁchala nīsājame agigem̐gāga