పాయపుమదము వట్టి పనులేమి యెఱఁగను
(॥పల్లవి॥)
పాయపుమదము వట్టి పనులేమి యెఱఁగను
చేయిమీఁదె నీవేమైనాఁ జేసుకోరాదా
(॥పాయ॥)
సిగ్గువడ్డనాచిత్తము చెప్పినట్టు సేసీనా
తగ్గి నన్ను మూలమూల దాఁచుఁగాక
యెగ్గువట్టి యేలదూరే వెంతగబ్బి నేనంటా
అగ్గమై నీయిచ్చల నేమైనాఁ జేయరాదా
(॥పాయ॥)
వాసితోడినాచలము వసము నాకయ్యీనా
యీసురేఁచి అట్టె బిగియింపించుఁగాక
ఆసలనేల జంకించే వంకెకు నే రానంటా
సేసవెట్టి యేమైనాఁ జేసుకోరాదా
(॥పాయ॥)
అంగపుజవ్వనమద మడఁచితే నడఁగీనా
పొంగుచు నీకాఁగిటిలో బోగించుంగాక
రంగగుశ్రీవేంకటేశ రతి నలమేల్ మంగను
చెంగట నిచ్చఁ బెండ్లి సేసుకోరాదా
(||pallavi||)
pāyabumadamu vaṭṭi panulemi yĕṟam̐ganu
seyimīm̐dĕ nīvemainām̐ jesugorādā
(||pāya||)
sigguvaḍḍanāsittamu sĕppinaṭṭu sesīnā
taggi nannu mūlamūla dām̐sum̐gāga
yĕgguvaṭṭi yeladūre vĕṁtagabbi nenaṁṭā
aggamai nīyichchala nemainām̐ jeyarādā
(||pāya||)
vāsidoḍināsalamu vasamu nāgayyīnā
yīsurem̐si aṭṭĕ bigiyiṁpiṁchum̐gāga
āsalanela jaṁkiṁche vaṁkĕgu ne rānaṁṭā
sesavĕṭṭi yemainām̐ jesugorādā
(||pāya||)
aṁgabujavvanamada maḍam̐side naḍam̐gīnā
pŏṁgusu nīgām̐giḍilo bogiṁchuṁgāga
raṁgaguśhrīveṁkaḍeśha radi nalamel maṁganu
sĕṁgaḍa nichcham̐ bĕṁḍli sesugorādā