Paayabu vanida nimta pachchi seduraa

పాయపు వనిత నింత పచ్చి సేతురా
Language

(॥పల్లవి॥)
పాయపు వనిత నింత పచ్చి సేతురా
మూయక మూసీని చలముల నింతి వలపు

(॥పాయవు॥)
కుప్పుగాఁ గుచ్చెలవిడఁ గొంగు వట్టి తీసితేను
కొప్పునెరులఁ జెలి మైఁ గప్పుకొనెను
తప్పక వాలుఁజూపులతరుణిమోము చూచితే
రెప్పలు మూయుచు సిగ్గు రేఁగ నీక దాఁచెను

(॥పాయవు॥)
సారెకుఁ జేతులు చాఁచి చన్నులు నీ వంటఁగాను
కూరిమిఁ జేతుల మూసుకొనే నవ్వుచు
బీరాన నాపె మోవిఁ బెదవి నంటించఁబోతే
దార దప్పకుండ తన తమ్ములానఁ గప్పెను

(॥పాయవు॥)
బంగారు వొడ్డాణము పట్టి నీ వెడలించితే
అంగమున నీ రెంటె మంగలించెను
సంగతి శ్రీవేంకటేశ సకియ నీవు గూడితే
ముంగిటిమదనకళ ముప్పిరిగొలిపెను

(||pallavi||)
pāyabu vanida niṁta pachchi sedurā
mūyaga mūsīni salamula niṁti valabu

(||pāyavu||)
kuppugām̐ guchchĕlaviḍam̐ gŏṁgu vaṭṭi tīsidenu
kŏppunĕrulam̐ jĕli maim̐ gappugŏnĕnu
tappaga vālum̐jūbuladaruṇimomu sūside
rĕppalu mūyusu siggu rem̐ga nīga dām̐sĕnu

(||pāyavu||)
sārĕgum̐ jedulu sām̐si sannulu nī vaṁṭam̐gānu
kūrimim̐ jedula mūsugŏne navvusu
bīrāna nābĕ movim̐ bĕdavi naṁṭiṁcham̐bode
dāra dappaguṁḍa tana tammulānam̐ gappĕnu

(||pāyavu||)
baṁgāru vŏḍḍāṇamu paṭṭi nī vĕḍaliṁchide
aṁgamuna nī rĕṁṭĕ maṁgaliṁchĕnu
saṁgadi śhrīveṁkaḍeśha sagiya nīvu gūḍide
muṁgiḍimadanagaḽa muppirigŏlibĕnu