పాయపు మోహములకుఁ బాటి లేదు
(॥పల్లవి॥)
పాయపు మోహములకుఁ బాటి లేదు
కాయపు మర్మము లంటఁ గాలము లేదా
(॥పాయ॥)
ముంచిననీనాసంది మొగ మోటా లుండఁగాను
కంచువంటిచూపులేల కాఁడిపారీని
యించుకంతదడవే యెడసితి వింతెకాక
నించి నీవొళ్ల నేమైనా నేర మున్నదా
(॥పాయ॥)
చనవుల నీనాందిసందిమాట లుండఁగాను
ననుపులనవ్వు లేల నాము లెక్కీని
మనసున నేమిటికో మరచితి వింతెకాక
వెనకటిపొందులకు వెలితున్నదా
(॥పాయ॥)
కలసేటిమనసులోని కాఁగిలింత లుండఁగాను
పులక మొలక లేల పోది సేసీని
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
బెళక నీనాసంది భేదమున్నదా
(||pallavi||)
pāyabu mohamulagum̐ bāḍi ledu
kāyabu marmamu laṁṭam̐ gālamu ledā
(||pāya||)
muṁchinanīnāsaṁdi mŏga moḍā luṁḍam̐gānu
kaṁchuvaṁṭisūbulela kām̐ḍibārīni
yiṁchugaṁtadaḍave yĕḍasidi viṁtĕgāga
niṁchi nīvŏḽla nemainā nera munnadā
(||pāya||)
sanavula nīnāṁdisaṁdimāḍa luṁḍam̐gānu
nanubulanavvu lela nāmu lĕkkīni
manasuna nemiḍigo marasidi viṁtĕgāga
vĕnagaḍibŏṁdulagu vĕlidunnadā
(||pāya||)
kalaseḍimanasuloni kām̐giliṁta luṁḍam̐gānu
pulaga mŏlaga lela podi sesīni
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
bĕḽaga nīnāsaṁdi bhedamunnadā