Paayabu madamuvelam batta vasamaa ninnu

పాయపు మదమువేళఁ బట్ట వసమా నిన్ను
Language

(॥పల్లవి॥)
పాయపు మదమువేళఁ బట్ట వసమా నిన్ను
ఆయము నే నెరుఁగుదు నవులేరా వేగిరమా

(॥పాయ॥)
వలసినప్పుడు నీతో వాసి రేఁచుకొనేఁ గాని
చెలఁగి యేమి సేసినాఁ జేయరా నీవు
చలము సాదించేవేళ సాదించేఁ గాని నీతో
అలగి నిన్నేమి సేసే నయ్యా నే నిప్పుడు

(॥పాయ॥)
చేతికి లోనైనప్పుడు సిగ్గువిడిపంచేఁ గాని
యీతల నందరిలో నీయిచ్చరా నేఁడు
నీతలఁపు గని మీఁది నిన్నుఁజక్కఁ బెట్టేఁ గాని
కాతరించి సెలవేమి కటకటా యిఁకను

(॥పాయ॥)
నవ్వు వచ్చినయప్పుడు నవ్వేఁగాని నీతోను
నివ్వటిల్లఁ గలయరా నీవే నన్ను
యివ్వల శ్రీవేంకటేశ యిదివో నేఁ గూడితిఁ
నెవ్వరు యేమి చెప్పేరు యేడకేడ మాటలు

(||pallavi||)
pāyabu madamuveḽam̐ baṭṭa vasamā ninnu
āyamu ne nĕrum̐gudu navulerā vegiramā

(||pāya||)
valasinappuḍu nīdo vāsi rem̐sugŏnem̐ gāni
sĕlam̐gi yemi sesinām̐ jeyarā nīvu
salamu sādiṁcheveḽa sādiṁchem̐ gāni nīdo
alagi ninnemi sese nayyā ne nippuḍu

(||pāya||)
sedigi lonainappuḍu sigguviḍibaṁchem̐ gāni
yīdala naṁdarilo nīyichcharā nem̐ḍu
nīdalam̐pu gani mīm̐di ninnum̐jakkam̐ bĕṭṭem̐ gāni
kādariṁchi sĕlavemi kaḍagaḍā yim̐kanu

(||pāya||)
navvu vachchinayappuḍu navvem̐gāni nīdonu
nivvaḍillam̐ galayarā nīve nannu
yivvala śhrīveṁkaḍeśha yidivo nem̐ gūḍidim̐
nĕvvaru yemi sĕpperu yeḍageḍa māḍalu