Paayabu madamunanu bhaavimchi soodavugaaga

పాయపు మదమునను భావించి చూడవుగాక
Language

(॥పల్లవి॥)
పాయపు మదమునను భావించి చూడవుగాక
ఆయమెరిఁగిన సతి యట్టె నవ్వవలదా

(॥॥)
పరగ నాపె వద్దఁ బవళించి వుండఁగాను
సరసములాడేవు సారె నాతోను
మరిగియున్న దాన మాటాడ సిగ్గువడితే
సరినున్నజవరాలు సాదించకుండునా

(॥॥)
తోలుతే వచ్చినయాపె తొడమీఁదఁ గూచుండఁగా
పలుమారు నామీఁద బత్తి సేసేవు
తలుపుమాఁటుదాన తలవంచుకుండితేను
బలిమిగలదేవులు పంతములు మానునా

(॥॥)
గట్టిగా నాపె నిన్నుఁ గాఁగిలించుకుండఁ గాను
ఇట్టె చేతులు చాఁచే నిటు నాపైని
దిట్టవై శ్రీ వేంకటేశ తెరవేసి నేఁ గూడితే
పట్టపుదేవులు నిన్నుఁ బంగించఁ దగదా

(||pallavi||)
pāyabu madamunanu bhāviṁchi sūḍavugāga
āyamĕrim̐gina sadi yaṭṭĕ navvavaladā

(||||)
paraga nābĕ vaddam̐ bavaḽiṁchi vuṁḍam̐gānu
sarasamulāḍevu sārĕ nādonu
marigiyunna dāna māḍāḍa sigguvaḍide
sarinunnajavarālu sādiṁchaguṁḍunā

(||||)
tolude vachchinayābĕ tŏḍamīm̐dam̐ gūsuṁḍam̐gā
palumāru nāmīm̐da batti sesevu
talubumām̐ṭudāna talavaṁchuguṁḍidenu
balimigaladevulu paṁtamulu mānunā

(||||)
gaṭṭigā nābĕ ninnum̐ gām̐giliṁchuguṁḍam̐ gānu
iṭṭĕ sedulu sām̐se niḍu nābaini
diṭṭavai śhrī veṁkaḍeśha tĕravesi nem̐ gūḍide
paṭṭabudevulu ninnum̐ baṁgiṁcham̐ dagadā