Paayabu madamulela pasaarimchevu

పాయపు మదములేల పచారించేవు
Language

(॥పల్లవి॥)
పాయపు మదములేల పచారించేవు
చాయలా సన్నలా నిట్టె జట్టిగొనరాదా

(॥॥)
చలము సాదింతురా సతులపై విభుఁడవు
వలచి ప్రియము చెప్పవలెఁగాక
తొలుతే నమ్మించి తెచ్చి దోసము గట్టుకోనేల
చెలియచనవు నేఁడు చెల్లించరాదా

(॥॥)
ఱట్టుగాఁ జేయుదురా గుట్టున రామల నీవు
చుట్టరికమై నయము చూపుట గాక
వట్టియాసలనుఁ బెట్టి వలవంత నేఁచనేల
ఇట్టె కొంతకోరిక యీడేర్చరాదా

(॥॥)
తగవులఁ బెట్టుదురా తరుణుల నింతేసి
తగినరతులఁ గూడి దక్కుట గాక
మిగులా శ్రీ వేంకటేశ మెచ్చి గుట్టుసేయనేల
మగువఁ గూడితి విట్టె మన్నించగాదా

(||pallavi||)
pāyabu madamulela pasāriṁchevu
sāyalā sannalā niṭṭĕ jaṭṭigŏnarādā

(||||)
salamu sādiṁturā sadulabai vibhum̐ḍavu
valasi priyamu sĕppavalĕm̐gāga
tŏlude nammiṁchi tĕchchi dosamu gaṭṭugonela
sĕliyasanavu nem̐ḍu sĕlliṁcharādā

(||||)
ṟaṭṭugām̐ jeyudurā guṭṭuna rāmala nīvu
suṭṭarigamai nayamu sūbuḍa gāga
vaṭṭiyāsalanum̐ bĕṭṭi valavaṁta nem̐sanela
iṭṭĕ kŏṁtagoriga yīḍersarādā

(||||)
tagavulam̐ bĕṭṭudurā taruṇula niṁtesi
taginaradulam̐ gūḍi dakkuḍa gāga
migulā śhrī veṁkaḍeśha mĕchchi guṭṭuseyanela
maguvam̐ gūḍidi viṭṭĕ manniṁchagādā