Paayabu madamo yidi pattinatti salamo

పాయపు మదమో యిది పట్టినట్టి చలమో
Language

(॥పల్లవి॥)
పాయపు మదమో యిది పట్టినట్టి చలమో
యీయడ నింతటనైనా యెచ్చరవయ్యా

(॥పాయ॥)
మాటలాడ దొరకొంటే మరేమిటా ముగియదు
యీటుతో నింతికి వీడెమియ్యవయ్యా
పాటించి గోర నొత్తినా పరాకున నెరఁగవు
చోటెల్లా నిండె బుజము చూచుకోవయ్యా

(॥పాయ॥)
కేరి నవ్వఁజొచ్చితేను కిందుమీఁదు నెరఁగవు
బోరున గందమీపెకుఁ బూయవయ్యా
సారెఁ బువ్వుల వేసినా జవ్వనమదాన లోఁగ
వీ రీతిని మేన దిష్టమెరుఁగుకోవయ్యా

(॥పాయ॥)
తప్పక చూడఁబోతే నెప్పుడూ రెప్ప మూయవు
చిప్పిలీపెఁ గూడితివి శ్రీ వేంకటేశ
కొప్పు వట్టినాఁ జూడవు కూడినపరవశాన
తెప్పలాయ సంతోసాలు తెలుసుకోవయ్యా

(||pallavi||)
pāyabu madamo yidi paṭṭinaṭṭi salamo
yīyaḍa niṁtaḍanainā yĕchcharavayyā

(||pāya||)
māḍalāḍa dŏragŏṁṭe maremiḍā mugiyadu
yīḍudo niṁtigi vīḍĕmiyyavayyā
pāḍiṁchi gora nŏttinā parāguna nĕram̐gavu
soḍĕllā niṁḍĕ bujamu sūsugovayyā

(||pāya||)
keri navvam̐jŏchchidenu kiṁdumīm̐du nĕram̐gavu
boruna gaṁdamībĕgum̐ būyavayyā
sārĕm̐ buvvula vesinā javvanamadāna lom̐ga
vī rīdini mena diṣhṭamĕrum̐gugovayyā

(||pāya||)
tappaga sūḍam̐bode nĕppuḍū rĕppa mūyavu
sippilībĕm̐ gūḍidivi śhrī veṁkaḍeśha
kŏppu vaṭṭinām̐ jūḍavu kūḍinabaravaśhāna
tĕppalāya saṁtosālu tĕlusugovayyā