Paavanamu gaavo jihvaa bradugavo jeevumdaa

పావనము గావో జిహ్వా బ్రదుకవో జీవుఁడా
Language

(॥పల్లవి॥)
పావనము గావో జిహ్వా బ్రదుకవో జీవుఁడా
వేవేల కితని నింక వేమారునుఁ బాడి

(॥పావ॥)
హరినామములే పాడి అతని పట్టపురాణి
ఇరవై మించినయట్టి యిందిరఁ బాడి
సరి నిరువంకలాను శంఖచక్రములఁ బాడి
వరద కటిహస్తాలు వరుసతోఁ బాడి

(॥పావ॥)
ఆదిపురుషునిఁ బాడి అట్టె భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపు బ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబుకంఠ మంకెతోఁ బాడి

(॥పావ॥)
శ్రీవేంకటేశుఁ బాడి శిరసు తులసిఁ బాడి
శ్రీవత్వముతోడురముఁ జెలగి పాడి
లావుల మకరకుండలాల కర్ణములు పాడి
ఆవటించి యీతని సర్వాంగములుఁ బాడి

(||pallavi||)
pāvanamu gāvo jihvā bradugavo jīvum̐ḍā
vevela kidani niṁka vemārunum̐ bāḍi

(||pāva||)
harināmamule pāḍi adani paṭṭaburāṇi
iravai miṁchinayaṭṭi yiṁdiram̐ bāḍi
sari niruvaṁkalānu śhaṁkhasakramulam̐ bāḍi
varada kaḍihastālu varusadom̐ bāḍi

(||pāva||)
ādiburuṣhunim̐ bāḍi aṭṭĕ bhūmisadim̐ bāḍi
pādamulam̐ bāḍi nābhibadmamum̐ bāḍi
modabu brahmāṁḍālu mose vudaramum̐ bāḍi
ādarānam̐ gaṁbugaṁṭha maṁkĕdom̐ bāḍi

(||pāva||)
śhrīveṁkaḍeśhum̐ bāḍi śhirasu tulasim̐ bāḍi
śhrīvatvamudoḍuramum̐ jĕlagi pāḍi
lāvula magaraguṁḍalāla karṇamulu pāḍi
āvaḍiṁchi yīdani sarvāṁgamulum̐ bāḍi