పాసివున్న విరహపు బడలికేల చూచేవు
(॥పల్లవి॥)
పాసివున్న విరహపు బడలికేల చూచేవు
వేసరక ఇచ్చకమే వేమారుఁ జేయవే
(॥॥)
చెక్కునొక్కి బుజ్జగించి చెలుపుఁడు వేఁడుకొనీ
మొక్కవే పాదాలకు మొగమెత్తి
అక్కరతో నవ్వుమని ఆనవెట్టీఁ దనమీఁద
మక్కళించి యతనితో మాటలాడవే
(॥॥)
కొంచక తొడపై నిన్నుఁ గూచుండఁ బెట్టుకొనీ
ముంచి వినయానఁ బ్రియములు చెప్పవే
పొంచి తములమెల్లా నీపుక్కిటనిండాఁ బెట్టీ
వంచనలెల్లాఁజేసి వలపులు చల్లవే
(॥॥)
సారె శ్రీవేంకటేశుఁడు చన్నులపైఁ జేయిచాఁచీ
గారవించి మోవితేనె కప్పమియ్యవే
యీరీతి నిన్నుఁ గూడి యితవులెల్లాఁ జేసీ
వూరడించి రతులను వోలలాడఁ జేయవే
(||pallavi||)
pāsivunna virahabu baḍaligela sūsevu
vesaraga ichchagame vemārum̐ jeyave
(||||)
sĕkkunŏkki bujjagiṁchi sĕlubum̐ḍu vem̐ḍugŏnī
mŏkkave pādālagu mŏgamĕtti
akkarado navvumani ānavĕṭṭīm̐ danamīm̐da
makkaḽiṁchi yadanido māḍalāḍave
(||||)
kŏṁchaga tŏḍabai ninnum̐ gūsuṁḍam̐ bĕṭṭugŏnī
muṁchi vinayānam̐ briyamulu sĕppave
pŏṁchi tamulamĕllā nībukkiḍaniṁḍām̐ bĕṭṭī
vaṁchanalĕllām̐jesi valabulu sallave
(||||)
sārĕ śhrīveṁkaḍeśhum̐ḍu sannulabaim̐ jeyisām̐sī
gāraviṁchi movidenĕ kappamiyyave
yīrīdi ninnum̐ gūḍi yidavulĕllām̐ jesī
vūraḍiṁchi radulanu volalāḍam̐ jeyave