(॥పల్లవి॥)
పారరో యసురులు పంచబంగాళమై
వీరనృసింహుఁడు వెదకీ నదివో
(॥పార॥)
వాఁడులై వున్నవి వజ్రనఖంబులు
మూఁడవక న్నదె ముంచీ మంటలు
వేఁడిమి చల్లి వెస నిట్టూర్పులు
వీఁడె నృసింహుడు వేదాద్రిమీఁద
(॥పార॥)
కత్తులు నూరీ కఠినపుఁ గోరలు
కొత్తనురుగులటుఁ గురిసీ లాలల
కుత్తికలోపలఁ గులికీ నురుములు
హత్తె వీఁడె గరుడాచలమందు
(॥పార॥)
శుభములు సురలకుఁ జూపీ పాదముల
త్రిభువనంబులును తిరుమేన నివిగొ
విభవంబుల శ్రీ వేంకటనాయకుఁ -
డభయంబొసఁగీ నహోబలమున
(||pallavi||)
pāraro yasurulu paṁchabaṁgāḽamai
vīranṛsiṁhum̐ḍu vĕdagī nadivo
(||pāra||)
vām̐ḍulai vunnavi vajranakhaṁbulu
mūm̐ḍavaga nnadĕ muṁchī maṁṭalu
vem̐ḍimi salli vĕsa niṭṭūrbulu
vīm̐ḍĕ nṛsiṁhuḍu vedādrimīm̐da
(||pāra||)
kattulu nūrī kaṭhinabum̐ goralu
kŏttanurugulaḍum̐ gurisī lālala
kuttigalobalam̐ guligī nurumulu
hattĕ vīm̐ḍĕ garuḍāsalamaṁdu
(||pāra||)
śhubhamulu suralagum̐ jūbī pādamula
tribhuvanaṁbulunu tirumena nivigŏ
vibhavaṁbula śhrī veṁkaḍanāyagum̐ -
ḍabhayaṁbŏsam̐gī nahobalamuna