పాముకాటు చీరఁ దోమఁ బాసునా నేఁడు
(॥పల్లవి॥)
పాముకాటు చీరఁ దోమఁ బాసునా నేఁడు
యీ మతక మెరఁగమా యేమయ్య విభుఁడా
(॥పాము॥)
చక్కని యింతి యొకతె సారెసారె నీమీఁద
మక్కళించీ వలపులు మాటలలోనే
చెక్కుచేత నెరఁగమి సేసుక నీవిందరిలో
యెక్కడో చూచి నవ్వేవు యేమయ్య విభుఁడా
(॥పాము॥)
కిమ్ములనుండి యాపె గిరుపుతాఁ గన్నులనే
చిమ్ముచు లోనికి సన్న సేయఁగాను
నెమ్మదినందరిలోన నిన్నుఁగానివానివలె
యెమ్మెతోఁ బరాకు సేసేవేమయ్య విభుఁడా
(॥పాము॥)
చలివాసి యాపె నీతో సరసములాడఁగాను
తలవంచి నీవేల దాఁగఁ జూచేవు
అలమేలు మంగను నేననుచు శ్రీవేంకటేశ
యెలమిఁ గూడితి వింకనేమయ్య విభుఁడా
(||pallavi||)
pāmugāḍu sīram̐ domam̐ bāsunā nem̐ḍu
yī madaga mĕram̐gamā yemayya vibhum̐ḍā
(||pāmu||)
sakkani yiṁti yŏgadĕ sārĕsārĕ nīmīm̐da
makkaḽiṁchī valabulu māḍalalone
sĕkkuseda nĕram̐gami sesuga nīviṁdarilo
yĕkkaḍo sūsi navvevu yemayya vibhum̐ḍā
(||pāmu||)
kimmulanuṁḍi yābĕ girubudām̐ gannulane
simmusu lonigi sanna seyam̐gānu
nĕmmadinaṁdarilona ninnum̐gānivānivalĕ
yĕmmĕdom̐ barāgu sesevemayya vibhum̐ḍā
(||pāmu||)
salivāsi yābĕ nīdo sarasamulāḍam̐gānu
talavaṁchi nīvela dām̐gam̐ jūsevu
alamelu maṁganu nenanusu śhrīveṁkaḍeśha
yĕlamim̐ gūḍidi viṁkanemayya vibhum̐ḍā