పాలుగారీ చెక్కంటితే పసిబిడ్డఁడూ చన్నుఁ
(॥పల్లవి॥)
పాలుగారీ చెక్కంటితే పసిబిడ్డఁడూ చన్నుఁ-
బాలంటే పెదవులు చప్పరించీ బిడ్డఁడూ
(॥పాలు॥)
కాచేపూచేమాకులైన కడలకు దొబ్బీని
చేచేతనెత్తిన వారి చేతిబిడ్డఁడు
వాచవికి యిండ్లు చోచ్చెవ్వరికుండలైనా దొబ్బీ
యేచాయ నేమఱకురే యెఱఁగఁడు బిడ్డఁడు
(॥పాలు॥)
కొరముట్టుబండియైన కూలఁ గాలఁ దన్నీని
యిరివై పాములమడు గీఁదఁజొచ్చీవి
మరుగ నావులఁగాచి మల్లరాల విరిచీని
సరుగ బుద్దిచెప్పరే చలమరిబిడ్డఁడు
(॥పాలు॥)
వచ్చివచ్చి వయసెక్క వనితల వలపించీ
కుచ్చిపట్టి కొండ గొడగుగ నెత్తీని
అచ్చపు శ్రీవేంకటేశుఁ డందరిపాలిటివాఁడు
యిచ్చలాడి మెపంచరే యే తులాఁడీ బిడ్డఁడు
(||pallavi||)
pālugārī sĕkkaṁṭide pasibiḍḍam̐ḍū sannum̐-
bālaṁṭe pĕdavulu sappariṁchī biḍḍam̐ḍū
(||pālu||)
kāsebūsemāgulaina kaḍalagu dŏbbīni
sesedanĕttina vāri sedibiḍḍam̐ḍu
vāsavigi yiṁḍlu sochchĕvvariguṁḍalainā dŏbbī
yesāya nemaṟagure yĕṟam̐gam̐ḍu biḍḍam̐ḍu
(||pālu||)
kŏramuṭṭubaṁḍiyaina kūlam̐ gālam̐ dannīni
yirivai pāmulamaḍu gīm̐dam̐jŏchchīvi
maruga nāvulam̐gāsi mallarāla virisīni
saruga buddisĕppare salamaribiḍḍam̐ḍu
(||pālu||)
vachchivachchi vayasĕkka vanidala valabiṁchī
kuchchibaṭṭi kŏṁḍa gŏḍaguga nĕttīni
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁdaribāliḍivām̐ḍu
yichchalāḍi mĕbaṁchare ye tulām̐ḍī biḍḍam̐ḍu