Paaludaagina sattuva panigivachchenu nemdu

పాలుదాగిన సత్తువ పనికివచ్చెను నేఁడు
Language

(॥పల్లవి॥)
పాలుదాగిన సత్తువ పనికివచ్చెను నేఁడు
వోలిఁ బచ్చడములోన నొకతున్న దిదివో

(॥పాలు॥)
పల్లదాన నీవు రేపల్లెలోఁ బెరిగేనాఁడు
గొల్లెతల మూఁకలే కొలువెల్లాను
వొల్లనే సందడికోప కొకతె నీతురుమే
యిల్లుసేసుకొని వుండె నిరవై నేఁడిదిగో

(॥పాలు॥)
అంచెల వనముల నీ వావులఁ గాచేనాఁడు
చెంచులకదుపులే చెంగటెల్లాను
మించిన రొచ్చుకుఁ గాక మెలఁత వొక్కతె నేఁడు
పంచల నీబుజముపై పాదుకొనె నిదిగో

(॥పాలు॥)
తనర శ్రీవేంకటేశ ద్వారక నుండేనాఁడు
వనితలు వేవేలు వాడలెల్లాను
పెనఁగి జంగిలిలోనఁ బేరుకొనవలె నని
వొనర నొక్కతె నీ వురమెక్కె నిదిగో

(||pallavi||)
pāludāgina sattuva panigivachchĕnu nem̐ḍu
volim̐ bachchaḍamulona nŏgadunna didivo

(||pālu||)
palladāna nīvu reballĕlom̐ bĕrigenām̐ḍu
gŏllĕdala mūm̐kale kŏluvĕllānu
vŏllane saṁdaḍigoba kŏgadĕ nīdurume
yillusesugŏni vuṁḍĕ niravai nem̐ḍidigo

(||pālu||)
aṁchĕla vanamula nī vāvulam̐ gāsenām̐ḍu
sĕṁchulagadubule sĕṁgaḍĕllānu
miṁchina rŏchchugum̐ gāga mĕlam̐ta vŏkkadĕ nem̐ḍu
paṁchala nībujamubai pādugŏnĕ nidigo

(||pālu||)
tanara śhrīveṁkaḍeśha dvāraga nuṁḍenām̐ḍu
vanidalu vevelu vāḍalĕllānu
pĕnam̐gi jaṁgililonam̐ berugŏnavalĕ nani
vŏnara nŏkkadĕ nī vuramĕkkĕ nidigo