పాకము దప్పినఁ బనికిరా విఁకను
(॥పల్లవి॥)
పాకము దప్పినఁ బనికిరా విఁకను
దీకొని రమణుఁడ తెలుపఁగవలెనా
(॥పాక॥)
వుడికినచిత్తం బూఁకొననోపదు
పడఁతులతోఁ జెప్పర మాఁట
బడలినచేతులు పట్టఁగనోపవు
అడపమునకు వీడె మందియ్యరాదా
(॥పాక॥)
వాడుమోము నవ్వఁగనోపదు నీ-
వాడర సరసము లటువోయి
వీడినతురు మది విరులకు నోపదు
బోడమ్ముల మరుపొదుల నునచరా
(॥పాక॥)
కాఁగిన దేహము కప్పుడు కోపదు
రాఁగుఁబచ్చడము రతి నిడరా
కాఁగిట శ్రీవేంకటపతి కూడితిఁ
వేఁగక యిచటనే యెనసి వుండరా
(||pallavi||)
pāgamu dappinam̐ banigirā vim̐kanu
dīgŏni ramaṇum̐ḍa tĕlubam̐gavalĕnā
(||pāga||)
vuḍiginasittaṁ būm̐kŏnanobadu
paḍam̐tuladom̐ jĕppara mām̐ṭa
baḍalinasedulu paṭṭam̐ganobavu
aḍabamunagu vīḍĕ maṁdiyyarādā
(||pāga||)
vāḍumomu navvam̐ganobadu nī-
vāḍara sarasamu laḍuvoyi
vīḍinaduru madi virulagu nobadu
boḍammula marubŏdula nunasarā
(||pāga||)
kām̐gina dehamu kappuḍu kobadu
rām̐gum̐bachchaḍamu radi niḍarā
kām̐giḍa śhrīveṁkaḍabadi kūḍidim̐
vem̐gaga yisaḍane yĕnasi vuṁḍarā