పాటెల్లా నొక్కచో నుండు భాగ్య మొక్కచో నుండు
(॥పల్లవి॥)
పాటెల్లా నొక్కచో నుండు భాగ్య మొక్కచో నుండు
యీటువెట్టి పెద్దతనా లెంచఁ బనిలేదు
(॥పాటె॥)
సరవిఁ గలకాలముఁ జదువుచుండు నొకఁడు
గరిమ నీకృప నిన్నుఁ గను నొకఁడు
ధరఁ బ్రయాసముతోడఁ దపము సేయు నొకఁడు
శరణుచొచ్చి నీకుఁ జనవరౌ నొకఁడు
(॥పాటె॥)
వొక్కఁడు మోపుమోచు నొక్కఁడు గొలువుసేయు
వొక్కఁడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్కఁ డాచారము సేయు నొక్కఁడు మోక్షము గను
యెక్కడా నీకల్పన కేమి సేయవచ్చును
(॥పాటె॥)
భావించనటుగాన ఫలమెల్లా నీమూలము
యేవలనైనా నీవు యిచ్చితేఁ గద్దు
జీవులు నిన్నెఱఁగక చీఁకటి దవ్వఁగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు
(||pallavi||)
pāḍĕllā nŏkkaso nuṁḍu bhāgya mŏkkaso nuṁḍu
yīḍuvĕṭṭi pĕddadanā lĕṁcham̐ baniledu
(||pāḍĕ||)
saravim̐ galagālamum̐ jaduvusuṁḍu nŏgam̐ḍu
garima nīkṛpa ninnum̐ ganu nŏgam̐ḍu
dharam̐ brayāsamudoḍam̐ dabamu seyu nŏgam̐ḍu
śharaṇusŏchchi nīgum̐ janavarau nŏgam̐ḍu
(||pāḍĕ||)
vŏkkam̐ḍu mobumosu nŏkkam̐ḍu gŏluvuseyu
vŏkkam̐ḍu pŏgaḍī tyāga mūrage yaṁdu
vŏkkam̐ ḍāsāramu seyu nŏkkam̐ḍu mokṣhamu ganu
yĕkkaḍā nīgalbana kemi seyavachchunu
(||pāḍĕ||)
bhāviṁchanaḍugāna phalamĕllā nīmūlamu
yevalanainā nīvu yichchidem̐ gaddu
jīvulu ninnĕṟam̐gaga sīm̐kaḍi davvam̐ganela
śhrīveṁkaḍeśhvara ninnu seviṁchede nerubu