Paadare sobanaalu padamtulaala

పాడరే సోబనాలు పడఁతులాల
Language

(॥పల్లవి॥)
పాడరే సోబనాలు పడఁతులాల
వేడుక లిద్దరికిని వెలసెఁ జూడరే

(॥॥)
కొండలే పీఁటలుగాఁ గూచున్నా రెదురుబడి-
నండఁనే నారసింహుఁడు నాదిలక్ష్మియు
వెండిఁబైఁడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల
పెండిలాడే రిద్దరును ప్రియములఁజూడరే

(॥॥)
భవనాశిజలములఁ బాయక తోడ నీళ్లాడి-
రివలా నవలాఁ దాము యేటిదరుల
జవళి మంచివూవుల సరి సేసలు వెట్టుచు
తవిలి సుముహుర్తానఁ దప్పక చూచేరు

(॥॥)
పొందుగఁ గనకావతి భోగావతినదుల
సందడివసంతముగాఁ జల్లులాడుచు
అందమై శ్రీ వేంకటాద్రి నహోబలాన నొకఁ
చందమునఁ గూడి కూడి సరసములాడేరు

(||pallavi||)
pāḍare sobanālu paḍam̐tulāla
veḍuga liddarigini vĕlasĕm̐ jūḍare

(||||)
kŏṁḍale pīm̐ṭalugām̐ gūsunnā rĕdurubaḍi-
naṁḍam̐ne nārasiṁhum̐ḍu nādilakṣhmiyu
vĕṁḍim̐baim̐ḍi niṁḍugŏnna vedādri garuḍādrula
pĕṁḍilāḍe riddarunu priyamulam̐jūḍare

(||||)
bhavanāśhijalamulam̐ bāyaga toḍa nīḽlāḍi-
rivalā navalām̐ dāmu yeḍidarula
javaḽi maṁchivūvula sari sesalu vĕṭṭusu
tavili sumuhurdānam̐ dappaga sūseru

(||||)
pŏṁdugam̐ ganagāvadi bhogāvadinadula
saṁdaḍivasaṁtamugām̐ jallulāḍusu
aṁdamai śhrī veṁkaḍādri nahobalāna nŏgam̐
saṁdamunam̐ gūḍi kūḍi sarasamulāḍeru