Paabamu seruva praanunigi

పాపము చేరువ ప్రాణునికి
Language

(॥పల్లవి॥)
పాపము చేరువ ప్రాణునికి
యేపునఁ బుణ్యంబేదో కాని

(॥పాపము॥)
ముక్కున నున్నది ముంగోపం బిది
యెక్కువ శాంతం బిందున్నదో
చిక్కని యాసలు చేతిలో నున్నవి
గక్కున విరతే కానము గాని

(॥పాపము॥)
కన్నుల నున్నది కామాంధకారము
యెన్నిక విజ్ఞాన మెందున్నదో
వున్నది నాలుక నూరక దైన్యము
యిన్నిట ధైర్యం బెఱుఁగము గాని

(॥పాపము॥)
అవిగో తనువున ననాచారములు
యివల సద్ధర్మం బెందున్నదో
వివరి మొసఁగి శ్రీవేంకటేశ నా
భవ మీడేర్చఁగ బ్రదికితిఁ గాని

(||pallavi||)
pābamu seruva prāṇunigi
yebunam̐ buṇyaṁbedo kāni

(||pābamu||)
mukkuna nunnadi muṁgobaṁ bidi
yĕkkuva śhāṁtaṁ biṁdunnado
sikkani yāsalu sedilo nunnavi
gakkuna virade kānamu gāni

(||pābamu||)
kannula nunnadi kāmāṁdhagāramu
yĕnniga vijñāna mĕṁdunnado
vunnadi nāluga nūraga dainyamu
yinniḍa dhairyaṁ bĕṟum̐gamu gāni

(||pābamu||)
avigo tanuvuna nanāsāramulu
yivala saddharmaṁ bĕṁdunnado
vivari mŏsam̐gi śhrīveṁkaḍeśha nā
bhava mīḍersam̐ga bradigidim̐ gāni