ఒయ్యనే లాలించి చన వొసఁగవయ్యా
(॥పల్లవి॥)
ఒయ్యనే లాలించి చన వొసఁగవయ్యా
నెయ్యపుసాము సేసిన నీచేతుల కోపునా
(॥॥)
మొలకసిగ్గులతోడిములువాఁడి గుబ్బలది
బలిమినేసి యేల పైకొనేవయ్యా
చిలుకపలుకుల లేఁజిగురాకుమోవిలేమ-
నెలయింపులను నేఁటి కలయంచే వయ్యా
(॥॥)
కడుఁబచ్చివయసుతోఁ గారుకొన్నమానిని
నొడివట్టి తీసి యెంత వొరసేవయ్యా
చిడుముడినగవులచిఱుతతనాలబాల
నడుమ నెందాఁకాఁ బెనఁగులాడేవయ్యా
(॥॥)
పసురుఁబాయమునఁ బరగినజవరాలు
పిసికి కాఁగిట నెంతబిగించేవయ్యా
కొసరి శ్రీ వేంకటేశ కొత్తపెండ్లికూఁతురు
యెసఁగి కూడితి విందు కెంతమేచ్చేవయ్యా
(||pallavi||)
ŏyyane lāliṁchi sana vŏsam̐gavayyā
nĕyyabusāmu sesina nīsedula kobunā
(||||)
mŏlagasigguladoḍimuluvām̐ḍi gubbaladi
baliminesi yela paigŏnevayyā
silugabalugula lem̐jigurāgumovilema-
nĕlayiṁpulanu nem̐ṭi kalayaṁche vayyā
(||||)
kaḍum̐bachchivayasudom̐ gārugŏnnamānini
nŏḍivaṭṭi tīsi yĕṁta vŏrasevayyā
siḍumuḍinagavulasiṟudadanālabāla
naḍuma nĕṁdām̐kām̐ bĕnam̐gulāḍevayyā
(||||)
pasurum̐bāyamunam̐ baraginajavarālu
pisigi kām̐giḍa nĕṁtabigiṁchevayyā
kŏsari śhrī veṁkaḍeśha kŏttabĕṁḍligūm̐turu
yĕsam̐gi kūḍidi viṁdu kĕṁtamechchevayyā