ఒయ్యనే దగ్గరరమ్మ వూడిగపు సతులు
(॥పల్లవి॥)
ఒయ్యనే దగ్గరరమ్మ వూడిగపు సతులు
అయ్యో విసరరమ్మ అలశున్నవాఁడు
(॥ఒయ్య॥)
మెఱయుఁజెమటలతో మెత్తని పరపు మీఁద
వొఱగి పవ్వళించినాఁ డొత్తగిలి
జఱయుమాటలతోడ చాఁచిన పాదములతో
గుఱియైన సతులతో గోవిందరాజు
(॥ఒయ్య॥)
తెల్లని కన్నులతోడ తేనె గారుమోవితోడ
చెల్లుడిఁ బవ్వళించె శేషునిమీఁద
వెల్లిగొను వూర్పులతో వెన్నెల నవ్వులతో
కొల్లవలపులు చల్లీ గోవిందరాజు
(॥ఒయ్య॥)
బొడ్డు వూప కొడుకుతో పుక్కిటి వీడెము తోడ
వొడ్డిన రతులలోన నోలలాడీని
వెడ్డువెట్టి కూడెను శ్రీవేంకటేశుఁ డింతులను
గొడ్డువోని వరముల గోవిందరాజు
(||pallavi||)
ŏyyane daggararamma vūḍigabu sadulu
ayyo visararamma alaśhunnavām̐ḍu
(||ŏyya||)
mĕṟayum̐jĕmaḍalado mĕttani parabu mīm̐da
vŏṟagi pavvaḽiṁchinām̐ ḍŏttagili
jaṟayumāḍaladoḍa sām̐sina pādamulado
guṟiyaina sadulado goviṁdarāju
(||ŏyya||)
tĕllani kannuladoḍa tenĕ gārumovidoḍa
sĕlluḍim̐ bavvaḽiṁchĕ śheṣhunimīm̐da
vĕlligŏnu vūrbulado vĕnnĕla navvulado
kŏllavalabulu sallī goviṁdarāju
(||ŏyya||)
bŏḍḍu vūba kŏḍugudo pukkiḍi vīḍĕmu toḍa
vŏḍḍina radulalona nolalāḍīni
vĕḍḍuvĕṭṭi kūḍĕnu śhrīveṁkaḍeśhum̐ ḍiṁtulanu
gŏḍḍuvoni varamula goviṁdarāju