ఒయ్యన చేరి పాదా లొత్తవమ్మ
(॥పల్లవి॥)
ఒయ్యన చేరి పాదా లొత్తవమ్మ
తియ్యని నోరనే మాట తియ్యవమ్మా
(॥ఒయ్యన॥)
పదియారువన్నెబొమ్మ పట్టపు వొలుకేమమ్మ
యెదురుగొండ లెక్కితి వేమమ్మ
పెదవిపై వాదులనే బేఁట్లు రాలి తమ్మ
యిదివో నీపతితోడ నింత వద్దా అమ్మా
(॥ఒయ్యన॥)
అతనునిఁ గన్నకొమ్మ హరియఱచేతి నిమ్మ
యితని యలుక దేర్చ వేమమ్మ
మతకాలే నెరుపేవు మదము చెక్కులఁ గమ్మ
యితవరి పతితోడ నింత గద్దా అమ్మ
(॥ఒయ్యన॥)
యీవిఁ గల్పకపు రెమ్మ యింటిలో దాఁచిన సొమ్మ
యీవిభుఁ దప్పక చూచే వేమమ్మ
శ్రీవేంకటేశుఁడైన శ్రీనరసింహునితోడ
యీవేళనే యెక్కుకొంటి వింత గద్దా అమ్మా
(||pallavi||)
ŏyyana seri pādā lŏttavamma
tiyyani norane māḍa tiyyavammā
(||ŏyyana||)
padiyāruvannĕbŏmma paṭṭabu vŏlugemamma
yĕdurugŏṁḍa lĕkkidi vemamma
pĕdavibai vādulane bem̐ṭlu rāli tamma
yidivo nībadidoḍa niṁta vaddā ammā
(||ŏyyana||)
adanunim̐ gannagŏmma hariyaṟasedi nimma
yidani yaluga dersa vemamma
madagāle nĕrubevu madamu sĕkkulam̐ gamma
yidavari padidoḍa niṁta gaddā amma
(||ŏyyana||)
yīvim̐ galbagabu rĕmma yiṁṭilo dām̐sina sŏmma
yīvibhum̐ dappaga sūse vemamma
śhrīveṁkaḍeśhum̐ḍaina śhrīnarasiṁhunidoḍa
yīveḽane yĕkkugŏṁṭi viṁta gaddā ammā