ఒయ్య నొయ్యఁ గానవచ్చె వువిద సొబగులెల్లా
(॥పల్లవి॥)
ఒయ్య నొయ్యఁ గానవచ్చె వువిద సొబగులెల్లా
నెయ్యమున మెరసెను నెట్టుకొన్న చేఁతలు
(॥ఒయ్య॥)
జలజాక్షి వీనుల జవ్వాది కరఁగులు
చెలువపు చెక్కు చేతిసగ్గులమరఁగులు
మెలుపుఁ గళలమోము మించులమెరుఁగులు
తలకొనెఁ జూడరమ్మ తరుణ లిందరును
(॥ఒయ్య॥)
వనితమోని మీఁదటి వాడులేనివొళ్ళు
వెనుకొన్న నగవులవెన్నెలపొళ్ళు
తనువుపై చెమటచిత్తడివాన నీళ్ళు
మునుకొనెఁ జూడరమ్మా ముప్పిరి గొనియను
(॥ఒయ్య॥)
అలమేలు మంగమేన నడరెఁ బులకలు
నిలువున జారుకొప్పునెరులమలకలు
యెలమి శ్రీవేంకటేశుఁ డీపె నిట్టె కూడఁగాను
నెలకొనెఁ జూడరమ్మ నిక్కపు గురుతులు
(||pallavi||)
ŏyya nŏyyam̐ gānavachchĕ vuvida sŏbagulĕllā
nĕyyamuna mĕrasĕnu nĕṭṭugŏnna sem̐talu
(||ŏyya||)
jalajākṣhi vīnula javvādi karam̐gulu
sĕluvabu sĕkku sedisaggulamaram̐gulu
mĕlubum̐ gaḽalamomu miṁchulamĕrum̐gulu
talagŏnĕm̐ jūḍaramma taruṇa liṁdarunu
(||ŏyya||)
vanidamoni mīm̐daḍi vāḍulenivŏḽḽu
vĕnugŏnna nagavulavĕnnĕlabŏḽḽu
tanuvubai sĕmaḍasittaḍivāna nīḽḽu
munugŏnĕm̐ jūḍarammā muppiri gŏniyanu
(||ŏyya||)
alamelu maṁgamena naḍarĕm̐ bulagalu
niluvuna jārugŏppunĕrulamalagalu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍībĕ niṭṭĕ kūḍam̐gānu
nĕlagŏnĕm̐ jūḍaramma nikkabu gurudulu