Oyamma yedagede voyammaa

ఓయమ్మ యేడకేడే వోయమ్మా
Language

(॥పల్లవి॥)
ఓయమ్మ యేడకేడే వోయమ్మా
యీయెడ మీసాలతేనె యీవలపు

(॥॥)
రమ్మని పిలువరాదు రాకుండితేఁ దిట్టరాదు
యెమ్మెలఁ గొండంతదొరే యీవిభుఁడు
బిమ్మిటి మెడవట్టదు పెట్టరాదు ముక్కునాకు
గుమ్మడికాయంతముత్తెమే యీకూటమి

(॥॥)
పూని వేఁగిరించరాదు బొంకితే నలుగరాదు
యీనెలఁత లెందరై నీతనికి
తానూఁ జేతికి నీఁడు దగ్గరి తీసుకోరాదు
యేనుగ చేతి చెఱకే యీమోహము

(॥॥)
ముంచి చేయి చాఁచరాదు మొనగోరు మోపరాదు
మించిన శ్రీవేంకటాద్రి మేఁటి యీతఁడు
కంచపుమో విచ్చి కూడె కడుఁదమకాలు రేఁచె
యెంచఁగఁ జుక్కలలెక్కే యీమరులు

(||pallavi||)
oyamma yeḍageḍe voyammā
yīyĕḍa mīsāladenĕ yīvalabu

(||||)
rammani piluvarādu rāguṁḍidem̐ diṭṭarādu
yĕmmĕlam̐ gŏṁḍaṁtadŏre yīvibhum̐ḍu
bimmiḍi mĕḍavaṭṭadu pĕṭṭarādu mukkunāgu
gummaḍigāyaṁtamuttĕme yīgūḍami

(||||)
pūni vem̐giriṁcharādu bŏṁkide nalugarādu
yīnĕlam̐ta lĕṁdarai nīdanigi
tānūm̐ jedigi nīm̐ḍu daggari tīsugorādu
yenuga sedi sĕṟage yīmohamu

(||||)
muṁchi seyi sām̐sarādu mŏnagoru mobarādu
miṁchina śhrīveṁkaḍādri mem̐ṭi yīdam̐ḍu
kaṁchabumo vichchi kūḍĕ kaḍum̐damagālu rem̐sĕ
yĕṁcham̐gam̐ jukkalalĕkke yīmarulu