(॥పల్లవి॥)
ఓయమ్మ తనపొందు వోపనంటినా
చేయివట్టి తియ్యనేలే చెలులు నన్నిపుడు
(॥ఓయ॥)
దగ్గరి మారాడ నాకుఁ దడవా నేఁడు దనతో
నెగ్గు దప్పు లౌనని యెంచేఁగాక
నిగ్గుల సరసమాడ నేరనా కొంతయినా
సిగ్గరితనానికే నేఁజింతించేఁగాక
(॥ఓయ॥)
సొలపుఁజూపులఁ దన్నుఁ జూచు టరుదా తనఁ
తలఁపు దెలియలేక దాఁగేఁగాక
సెలవినవ్వు దనపై చిలికించనేరనా
కొలఁది మీరునోయని కొంకేఁగాక
(॥ఓయ॥)
కాఁగిలించి యిట్లానే కరఁగించకుందునా
మూఁగినయాసలు చూపి మోపితిఁగాక
తోఁగెను చెమట నాకుఁదొడనె శ్రీవేంకటేశు
నాఁగి రతిఁ జొక్కించితి నందుకే కాక
(||pallavi||)
oyamma tanabŏṁdu vobanaṁṭinā
seyivaṭṭi tiyyanele sĕlulu nannibuḍu
(||oya||)
daggari mārāḍa nāgum̐ daḍavā nem̐ḍu danado
nĕggu dappu launani yĕṁchem̐gāga
niggula sarasamāḍa neranā kŏṁtayinā
siggaridanānige nem̐jiṁtiṁchem̐gāga
(||oya||)
sŏlabum̐jūbulam̐ dannum̐ jūsu ṭarudā tanam̐
talam̐pu dĕliyalega dām̐gem̐gāga
sĕlavinavvu danabai siligiṁchaneranā
kŏlam̐di mīrunoyani kŏṁkem̐gāga
(||oya||)
kām̐giliṁchi yiṭlāne karam̐giṁchaguṁdunā
mūm̐ginayāsalu sūbi mobidim̐gāga
tom̐gĕnu sĕmaḍa nāgum̐dŏḍanĕ śhrīveṁkaḍeśhu
nām̐gi radim̐ jŏkkiṁchidi naṁduge kāga