Oyamma taanemta vodambaraseene nannu

ఓయమ్మ తానెంత వొడఁబరచీనే నన్ను
Language

(॥పల్లవి॥)
ఓయమ్మ తానెంత వొడఁబరచీనే నన్ను
చేయి మీఁదాయఁ దనకుఁ జేతిలోని దాననే

(॥॥)
చెంతనుండి వూడిగము సేసే యిల్లాలఁగాక
పంతమాడే యిల్లాలనా పతితోను
వింతలేక తనమాట విననేరుతుఁ గాక
యెంతైనా తనకు నేనెదురాడనేర్తునా

(॥॥)
సిగ్గుతోడఁ బాదాలొత్తి చిమ్మిరేఁగే దానఁగాక
యెగ్గుపట్టే దాననా యెంతైనాను
వొగ్గి తనచేఁతలెల్లా వొడిఁగట్టుకొందుఁగాక
వెగ్గళించి యేమైనా వేసారుకొందునా

(॥॥)
ఇచ్చకమై నెరుపేటిదిది నాగుణము గాక
నచ్చుకొట్టి కొసరేదా నాగుణమా
అచ్చపుశ్రీ వేంకటేశుఁడంతలోనె నన్నుఁ గూడె
కొచ్చి తనగుణాలు చేంగొ నాడ నావసమా

(||pallavi||)
oyamma tānĕṁta vŏḍam̐barasīne nannu
seyi mīm̐dāyam̐ danagum̐ jediloni dānane

(||||)
sĕṁtanuṁḍi vūḍigamu sese yillālam̐gāga
paṁtamāḍe yillālanā padidonu
viṁtalega tanamāḍa vinanerudum̐ gāga
yĕṁtainā tanagu nenĕdurāḍanerdunā

(||||)
siggudoḍam̐ bādālŏtti simmirem̐ge dānam̐gāga
yĕggubaṭṭe dānanā yĕṁtainānu
vŏggi tanasem̐talĕllā vŏḍim̐gaṭṭugŏṁdum̐gāga
vĕggaḽiṁchi yemainā vesārugŏṁdunā

(||||)
ichchagamai nĕrubeḍididi nāguṇamu gāga
nachchugŏṭṭi kŏsaredā nāguṇamā
achchabuśhrī veṁkaḍeśhum̐ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
kŏchchi tanaguṇālu seṁgŏ nāḍa nāvasamā