ఓయమ్మ చూడఁగదరె వుద్దగిరికృష్టుఁడు
(॥పల్లవి॥)
ఓయమ్మ చూడఁగదరె వుద్దగిరికృష్టుఁడు
సేయు చేఁత లెల్లాను చెప్ప సిగ్గయ్యీనే
(॥ఓయ॥)
చూడ బాలుఁడుగాని సుదతులగాఁగిళ్లఁ
గూడేవేళ పాయపుకొమారుఁడే
దూడలఁ గాచేవేళ వాడగొల్లఁడై యుండుఁగాని
యేడఁ బక్కఁ బెట్టుకొంటే యింటిమగఁడౌనే
(॥ఓయ॥)
చీటికిమాటికి చిన్నిచేఁతలెల్లాఁ జేసుఁగాని
పాటించి ముద్దాడఁబోతే పచ్చిసేఁతలే
చాటిచాటి నేరిపిన చక్కమాటాడఁడు, లోన
మాటలాడించి చూచితే మదనతంత్రాలే
(॥ఓయ॥)
పట్టి చెక్కులు మీఁటితేఁ బాలు దాగీఁ గాని
వెట్టిమోవితేనెలకు వేడుకకాఁడే
మట్టులేనిమహిమల మానిశై వున్నాఁడుగాని
దిట్టి శ్రీవేంకటాద్రిపై దేవరై వున్నాఁడే
(||pallavi||)
oyamma sūḍam̐gadarĕ vuddagirikṛṣhṭum̐ḍu
seyu sem̐ta lĕllānu sĕppa siggayyīne
(||oya||)
sūḍa bālum̐ḍugāni sudadulagām̐giḽlam̐
gūḍeveḽa pāyabugŏmārum̐ḍe
dūḍalam̐ gāseveḽa vāḍagŏllam̐ḍai yuṁḍum̐gāni
yeḍam̐ bakkam̐ bĕṭṭugŏṁṭe yiṁṭimagam̐ḍaune
(||oya||)
sīḍigimāḍigi sinnisem̐talĕllām̐ jesum̐gāni
pāḍiṁchi muddāḍam̐bode pachchisem̐tale
sāḍisāḍi neribina sakkamāḍāḍam̐ḍu, lona
māḍalāḍiṁchi sūside madanadaṁtrāle
(||oya||)
paṭṭi sĕkkulu mīm̐ṭidem̐ bālu dāgīm̐ gāni
vĕṭṭimovidenĕlagu veḍugagām̐ḍe
maṭṭulenimahimala māniśhai vunnām̐ḍugāni
diṭṭi śhrīveṁkaḍādribai devarai vunnām̐ḍe