(॥పల్లవి॥)
ఓయమ్మ శ్రీవిభుఁ డోయమ్మ
కాయము నేఁ గరఁగితే కాఁక చల్లీనే
(॥ఓయ॥)
యెఱఁగమమ్మ నే నెవ్వరుంటా నావెనక
తెఱవఁ జూచితినంటాఁ దిట్లాడీని
మఱచితినమ్మ నే మాయపుదనసుద్దలు
గుఱిగా నవ్వితినంటాఁ గొంగువట్టీని
(॥ఓయ॥)
తలఁచనమ్మ నేఁడు తా నాకుఁబొంచినట్టి
కులికి మాటాడితేనే గొర నొక్కీని
తెలియనమ్మ తాఁ దిరిగి యింతిసేసేది
తలదువ్వి ముడిచితే తగులనాడీని
(॥ఓయ॥)
తడవనమ్మ నేను దగ్గరి శ్రీవేంకటేశు-
కెడమిచ్చితే వొద్ద యిట్టె పండీని
తోడరమమ్మ తానే తోడికి కాఁగిటఁ గూడి
బడలి నే నుండితేనే పంతమిచ్చీని
(||pallavi||)
oyamma śhrīvibhum̐ ḍoyamma
kāyamu nem̐ garam̐gide kām̐ka sallīne
(||oya||)
yĕṟam̐gamamma ne nĕvvaruṁṭā nāvĕnaga
tĕṟavam̐ jūsidinaṁṭām̐ diṭlāḍīni
maṟasidinamma ne māyabudanasuddalu
guṟigā navvidinaṁṭām̐ gŏṁguvaṭṭīni
(||oya||)
talam̐sanamma nem̐ḍu tā nāgum̐bŏṁchinaṭṭi
kuligi māḍāḍidene gŏra nŏkkīni
tĕliyanamma tām̐ dirigi yiṁtisesedi
taladuvvi muḍiside tagulanāḍīni
(||oya||)
taḍavanamma nenu daggari śhrīveṁkaḍeśhu-
kĕḍamichchide vŏdda yiṭṭĕ paṁḍīni
toḍaramamma tāne toḍigi kām̐giḍam̐ gūḍi
baḍali ne nuṁḍidene paṁtamichchīni