Oyamma ninnu geluva nobunade yeedamdu

ఓయమ్మ నిన్ను గెలువ నోపునటే యీతఁడు
Language

(॥పల్లవి॥)
ఓయమ్మ నిన్ను గెలువ నోపునటే యీతఁడు
నాయముచేతఁ జెప్పితే నాఁటె గోరనేవే

(॥ఓయ॥)
నవ్వుతా నాడెను మాట నాయకుఁడు నీతో
రవ్వలు సేసి యెంత రచ్చ వేసేవే
నివ్వటిల్ల సరసము నీతో సలుపుతాను
పువ్వుల వేసిన నిట్టే పొక్కెననేవే

(॥ఓయ॥)
వేడుకకుఁ బెనఁగెను వెస నితఁ డిందాఁకా
వూడెఁ గుచ్చెలంటా నెల వుప్పతించేవే
జాడతోడఁ దేనెలు చవులు చూచె నింతే
వాడె మోవియంటా మాకు వచ్చి యేమి చూపేవే

(॥ఓయ॥)
చెలరేఁగి కూడెను శ్రీవేంకటేశుఁడు నిన్ను
చలపాది యంటానేల సాదించేవే
వలపులు రేఁచె నిదే వాడికైన రతులను
అలయించెనంటా నేఁటి కప్పటిఁ జెనకేవే

(||pallavi||)
oyamma ninnu gĕluva nobunaḍe yīdam̐ḍu
nāyamusedam̐ jĕppide nām̐ṭĕ goraneve

(||oya||)
navvudā nāḍĕnu māḍa nāyagum̐ḍu nīdo
ravvalu sesi yĕṁta rachcha veseve
nivvaḍilla sarasamu nīdo salubudānu
puvvula vesina niṭṭe pŏkkĕnaneve

(||oya||)
veḍugagum̐ bĕnam̐gĕnu vĕsa nidam̐ ḍiṁdām̐kā
vūḍĕm̐ guchchĕlaṁṭā nĕla vuppadiṁcheve
jāḍadoḍam̐ denĕlu savulu sūsĕ niṁte
vāḍĕ moviyaṁṭā māgu vachchi yemi sūbeve

(||oya||)
sĕlarem̐gi kūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍu ninnu
salabādi yaṁṭānela sādiṁcheve
valabulu rem̐sĕ nide vāḍigaina radulanu
alayiṁchĕnaṁṭā nem̐ṭi kappaḍim̐ jĕnageve