ఓయమ్మ నేనెంతదాన నూడిగము సేసేఁగాక
(॥పల్లవి॥)
ఓయమ్మ నేనెంతదాన నూడిగము సేసేఁగాక
పాయని వో సకులాల పతితో మీరనరే
(॥ఓయ॥)
వెక్కెసమై తనకు నే విన్నపాలు సేసుకోఁగా
యెక్కడ నుండులో చిత్త మేమిసేతునే
చక్కనితనరూపము సారెఁ జూడఁగా నెవ్వతె-
దిక్కు చూచునో రెంట దెప్పరమై వుండఁగా
(॥ఓయ॥)
యేకతానకువచ్చి నే నింపులువుట్టించేనంటే
యేకాంతను రమ్మన్నాఁడో యెఱఁగఁగదే
చేకాను కిచ్చితేను చెలకైదండ వదలి
పైకొని నిమ్మపండ్లభార మానవలెఁగా
(॥ఓయ॥)
కనుసన్నలనే వచ్చి కాఁగిలించుకొనేనంటే
పెనఁగేటిరతులలో ప్రియ మెట్టిదో
యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
చనవిచ్చినాఁడు తానే సంతోసించవలెఁగా
(||pallavi||)
oyamma nenĕṁtadāna nūḍigamu sesem̐gāga
pāyani vo sagulāla padido mīranare
(||oya||)
vĕkkĕsamai tanagu ne vinnabālu sesugom̐gā
yĕkkaḍa nuṁḍulo sitta memisedune
sakkanidanarūbamu sārĕm̐ jūḍam̐gā nĕvvadĕ-
dikku sūsuno rĕṁṭa dĕpparamai vuṁḍam̐gā
(||oya||)
yegadānaguvachchi ne niṁpuluvuṭṭiṁchenaṁṭe
yegāṁtanu rammannām̐ḍo yĕṟam̐gam̐gade
segānu kichchidenu sĕlagaidaṁḍa vadali
paigŏni nimmabaṁḍlabhāra mānavalĕm̐gā
(||oya||)
kanusannalane vachchi kām̐giliṁchugŏnenaṁṭe
pĕnam̐geḍiradulalo priya mĕṭṭido
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
sanavichchinām̐ḍu tāne saṁtosiṁchavalĕm̐gā