Oyamma neelibiddam doyamma

ఓయమ్మ నీలిబిడ్డఁ డోయమ్మ
Language

(॥పల్లవి॥)
ఓయమ్మ నీలిబిడ్డఁ డోయమ్మ
యీయెడ యశోద నీవెట్టు గంటివమ్మా

(॥ఓయ॥)
గాలిగొట్టై తిరిగినగామిడివాఁ దొయమ్మ
గోలవలె నుండుఁగాని కోడెకాఁడమ్మా
తాలిమి యించుకాలేదొతరువరివాఁడమ్మ
ఆలరీఁడు నీబిడ్డఁ డదె బుద్దిచెప్పరో

(॥ఓయ॥)
కడలేనిసాహసాల గట్టు వాయివాఁడమ్మ
తడమారి ఇందరిలో తాటఁగట్టమ్మ
ముడికారితనముల మునిముచ్చువాఁడమ్మ
బడిబడి నుద్దండపనులు మానుపవో

(॥ఓయ॥)
శ్రీవేంకటాద్రిమీఁది సేఁతలయేతులవాఁడు
వావాత నుడుగులవడ్డి నాఁడు
వేవేలు దూరినాను విడువక మమ్ము నేలె
వోవల మాతప్పులెల్ల నోరుచుకొమ్మనవో

(||pallavi||)
oyamma nīlibiḍḍam̐ ḍoyamma
yīyĕḍa yaśhoda nīvĕṭṭu gaṁṭivammā

(||oya||)
gāligŏṭṭai tiriginagāmiḍivām̐ dŏyamma
golavalĕ nuṁḍum̐gāni koḍĕgām̐ḍammā
tālimi yiṁchugāledŏdaruvarivām̐ḍamma
ālarīm̐ḍu nībiḍḍam̐ ḍadĕ buddisĕpparo

(||oya||)
kaḍalenisāhasāla gaṭṭu vāyivām̐ḍamma
taḍamāri iṁdarilo tāḍam̐gaṭṭamma
muḍigāridanamula munimuchchuvām̐ḍamma
baḍibaḍi nuddaṁḍabanulu mānubavo

(||oya||)
śhrīveṁkaḍādrimīm̐di sem̐talayedulavām̐ḍu
vāvāda nuḍugulavaḍḍi nām̐ḍu
vevelu dūrinānu viḍuvaga mammu nelĕ
vovala mādappulĕlla norusugŏmmanavo